గోదావరి ఒడ్డున గట్టుపై ఓ శివాలయం ఉంది. ఇక దాని పై అంతస్తులో ఓ కళ్యాణమండపం ఉంది. ఆ రాత్రి శివాలయం గోడ పక్కన మెరుస్తూ ఓ ఆకారం కనిపించింది.. ఏంటని చూడగా..
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పంచాయతన కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో బుధవారం రాత్రి ఓ కొండచిలువ హల్చల్ చేసింది. గోదావరి ఒడ్డున ఉన్న గట్టుపై ఉన్న సుబ్రహ్మణ్య స్నానాల ఘాట్లో శివాలయం పై అంతస్తులో ఓ కళ్యాణమండపం, వేదిక ఉన్నాయి. బుధవారం రాత్రి ఆ వేదికలో ఓ వివాహం జరుగుతుండగా గోడ ప్రక్కన ఏదో మెరుస్తున్నట్లు అక్కడున్న స్థానికులు చూశారు. తీరా చూస్తే సుమారు 7 అడుగులు ఉన్న ఓ కొండచిలువ అటూ.. ఇటూ.. తిరుగుతోంది. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో ఉన్న అందరూ పరుగులు తీశారు. వెంటనే అక్కడున్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన వచ్చారు.
ఓ పక్క పెళ్లి భాజాలు,అందరూ గుమిగూడటంతో ఆ కొండచిలువ కాసేపు ఎటూ కదలకుండా ఉండిపోయింది. ఇటీవల వచ్చిన వరదలకు గోదావరి నుండి ఈ కొండచిలువ కొట్టుకు వచ్చిందని స్థానికులు భావిస్తున్నారు. దీంతో అక్కడున్న ఆలయ సిబ్బంది అటవీ శాఖకు, స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ కొండచిలువను తీసుకెళ్లారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




