April 9, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Prakasam District: సమస్య ఉందని పోలీసులకు పోన్.. యాక్షన్‌లోకి ఏకంగా జిల్లా ఎస్పీ..

పాపను వేధిస్తున్నారని పోలీసులకు స్థానికులు ఫోన్ చేశారు. విషయం ఎస్పీకి తెలియడంతో.. ఏకంగా రంగంలోకి దిగారు. స్పాట్‌కు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆడపిల్లల విషయంలో తమాషాలు చేస్తే ఎవర్ని వదిలిపెట్టం అని వార్నింగ్ ఇచ్చారు.


ఒక్క ఫోన్‌ కాల్‌… ఆ ఒక్క ఫోన్‌ కాల్‌తో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి రంగంలోకి దిగిపోయారు… మైనారిటీ తీరని బాలికను ఓ ఇద్దరు యువకులు కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారన్న ఫోన్‌ కాల్‌తో ఏకంగా జిల్లా ఎస్‌పి ఏఆర్‌ దామోదర్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు… వెంటనే ఆ ఇద్దరు యువకులను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు… బాధిత బాలికతో మాట్లాడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు… ఒంగోలు ఎన్‌జివో కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానకంగా కలకలం రేపింది… ఓ ఇద్దరు యువకులు బాలిక ఇంటి సమీపంలోనే ఆమెను టీజ్‌ చేస్తూ బెదిరింపులకు గురిచేసి బైక్‌పై తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో కాలనీ వాసులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. స్వయంగా SPనే ఘటనా స్థలానికి వచ్చి బాధితులకు అండగా నిలబడటంతో కాలనీ వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు.


ఈ సందర్బంగా ఎస్‌పి దామోదర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… ఒంగోలు వాళ్ళ బ్లడ్‌లోనే రౌడీయిజం ఉన్నట్టు కనిపిస్తోందని, దాన్ని బయటకు తీస్తామని అల్లరిమూకలను హెచ్చరించారు. గతంలో ఒంగోలులో రౌడీయిజం ఎక్కువగా ఉన్న సమయంలో ఒంగోలులో ట్రైనీ డిఎస్‌పిగా పనిచేసిన ప్రస్తుత ఎస్‌పి దామోదర్‌ గత అనుభవంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది… ఇప్పటికే బాలికను ఇబ్బందిపెట్టిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో కౌన్సిలింగ్‌ చేశామని, బాలికను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారా.. ఇబ్బంది పెట్టారా..? అన్న విషయాలను విచారణలో తేలుస్తామని ఎస్‌పి తెలిపారు… బాలికపై దౌర్జన్యం చేసిన విషయం వాస్తవం అయితే.. ఆ ఇద్దరు యువకులపై రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తామని తెలిపారు. ఒంగోలులో ఎలాంటి రౌడీయిజాన్ని సహించేది లేదని, గంజాయి బ్యాచ్‌ ఆగడాలను గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి దామోదర్‌ తెలిపారు

Also read :

Related posts

Share via