June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

గుహల్లో బండరాళ్ల మధ్య పోలీసుల తనిఖీలు.. వెలుగులోకి నివ్వరపోయే దృశ్యాలు..

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు (ఏఓబి)లో భద్రత బలగాలు ఏరియా డామినేట్ చేస్తున్నాయి. బెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 142 బెటాలియన్‎కు కీలక సమాచారం అందడంతో.. టార్గెట్ పాయింట్‎కు రీచ్ అయ్యారు. దట్టమైన అడవీ పరిసర ప్రాంతంలో వెతికినా ఏమీ కనిపించలేదు. ఓ చోట బండరాళ్లు, గుహలాంటి ప్రాంతం కనిపించింది.

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు (ఏఓబి)లో భద్రత బలగాలు ఏరియా డామినేట్ చేస్తున్నాయి. బెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 142 బెటాలియన్‎కు కీలక సమాచారం అందడంతో.. టార్గెట్ పాయింట్‎కు రీచ్ అయ్యారు. దట్టమైన అడవీ పరిసర ప్రాంతంలో వెతికినా ఏమీ కనిపించలేదు. ఓ చోట బండరాళ్లు, గుహలాంటి ప్రాంతం కనిపించింది. పెద్ద పెద్ద బండ రాళ్లు అందులో ఏముంటుందిలే అనుకున్నారు. అయినా ఎక్కడో చిన్న అనుమానం. మనిషి దూరేందుకు కూడా అవకాశం లేని రెండు బండరాల మధ్య ఏదో ఉన్నట్టు గుర్తించారు. అతి కష్టం మీద లోపలికి వెళ్లారు. అక్కడ పరిశీలిస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also read :మండి బిర్యానీ తిని తిరిగొస్తూ..

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశా మల్కన్ గిరి జిల్లా బెజ్జంగి వాడ రిజర్వ్ ఫారెస్ట్‎లో కుంబింగ్ చేస్తుండగా డంప్‎ను గుర్తించాయి భద్రతాబలగాలు. కుర్మనూరు పీఎస్ పరిధి దూలగండి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్‎ను వెలికి తీసారు. డంప్‎లో మందు పాతరలు, జిలిటిన్ స్టిక్స్ 98, ఎలక్ట్రానిక్ డిటర్ నేటర్లు 4, ఎస్ బి ఎం ఎల్ తుపాకులు 3, ఎల్ పి జి గ్యాస్ సిలిండర్లు, సోలార్ ప్లేట్, బ్యాటరీలు, వైరు, మెడిసిన్స్ ఉన్నాయి. భద్రతా బాలగాలే టార్గెట్‎గా డంప్ సిద్ధం చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Also read :Crime News: పరీక్షల్లో ఫెయిలైనందుకు మందలించారని తల్లి, తమ్ముడి హత్య

ఆ ప్రాంతం వారికి కంచుకోట..
బెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం చాలా కాలంగా మావోయిస్టులకు కంచుకోటగా ఉంది. మావోయిస్టులు, సానుభూతిపరులు ఈ ప్రాంతాన్ని తమ మనుగడ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భద్రతా బలగాలు, పోలీసులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ మావోయిస్టులు IEDలు, IED తయారీ సామగ్రి, ఆయుధాలు మొదలైన వాటిని ఏకాంత ప్రదేశాలలో ఉంచేవారని బిఎస్ఎఫ్ ప్రకటన జారీ చేసింది. ఆ ప్రాంతంలో మరింత కూంబింగ్, సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

Also read :జల్సాలకు అలవాటు పడ్డ యువకులు.. చోరీ చేసిన వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండా..

భార్యపై అనుమానంతో 6 ఏళ్ల కూతుర్ని హత్య చేసిన కసాయి తండ్రి

Related posts

Share via