July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

అప్పు ఎగ్గొట్టేందుకు హైడ్రామా.. అసలుగుట్టు రట్టు చేసిన పోలీసులు..

రాము..వీరాంజినేయులు ఇద్దరూ బంధువులే. వరుసకు బావ, బావమరదులు అవుతారు. అయితే రాము మంగళగిరిలో నివాసం ఉంటుండగా, వీరాంజినేయులు తాడేపల్లిలో ఉంటూ పెట్రోల్ బంక్‎లో పనిచేస్తుంటాడు. అయితే రాము బంగారు వ్యాపారం చేస్తున్నాడు. బంగారు వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని రాము చెప్పగా పలు దఫాలుగా 90 లక్షల వరకూ వీరాంజినేయులు ఇచ్చాడు. అయితే గత కొతకాలంగా తాను పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇవ్వాలంటూ వీరాంజినేయులు.. రాముపై ఒత్తిడి చేస్తున్నాడు.

Also read :పెళ్లై, పిల్లులున్న 40 ఏళ్ల వ్యక్తితో.. 19 ఏళ్ల యువతి ప్రేమ.. చివరకు

దీంతో ఒత్తిడి తట్టుకోలేని రాము ఏదైనా సలహా చెప్పమని తన స్నేహితుడు రత్నం వద్దకు వెళ్లాడు. రత్నం తన స్నేహితుడైన బబ్లూ వద్దకు రామును తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి దోపిడి డ్రామాకు తెరదీశారు. తాను విజయవాడ నుండి బంగారు తీసుకొస్తుండగా కొట్టి ఆ బ్యాగ్ తీసుకెళ్లాలని అలా చేస్తే పది లక్షలు ఇస్తానని రాము.. బబ్లూతో చెప్పాడు. ఇందుకు ఒప్పుకున్న బబ్లూ.. అతని స్నేహితులైన ప్రసన్నతో అసలు విషయం చెప్పి సాయం చేస్తే ఐదు లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇందుకు సరే అన్న ప్రసన్న ఆ సమయం కోసం వేచి చూస్తున్నాడు.

గత ఆదివారం రాము.. వీరాంజినేయులుకి ఫోన్ చేసి తాను హైదరాబాద్ నుండి బంగారం తీసుకొస్తున్నానని.. తనను ఇంటికి తీసుకెళ్లడానికి విజయవాడలోని బస్టాప్ వద్దకు రావాలని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మంగళగిరి బయలు దేరారు. అప్పటికే బ్యాగ్‎లో ఉన్న కేజీన్నర బంగారాన్ని రాము.. వీరాంజినేయులకు చూపించాడు. దీంతో నమ్మకం వచ్చిన వీరాంజినేయులు మంగళగిరి వెళ్లేందుకు రాము బైక్ ఎక్కాడు. తాడేపల్లిదాటి కొలనుకొండ వద్దకు రాగా ముగ్గురు వ్యక్తులు బైక్‎పై ఫాలో అవుతూ రామును అడ్డగించి అతని వద్ద నున్న బ్యాగ్ లాక్కొని పారిపోయారు. దీంతో కంగు తిన్న బావమరుదులు వెంటనే పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు.

Also read :కోడలిపై అఘాయిత్యం.. బాధను దిగమింగిన వివాహిత.. ఆపై కోర్టు సంచలన తీర్పు..

పోలీసులు రంగంలోకి దిగి తాడేపల్లి పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయితే రాము ప్రవర్తనపై అనుమానం వచ్చిన వీరాంజినేయులు.. పోలీసుల వద్దకు వెళ్లి రాము ప్రవర్తన అసహజంగా ఉందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు రాముని అదుపులోకి తీసుకొని విచారించగా దోపిడి గుట్టు రట్టైంది. నకిలీ బంగారం తీసుకొచ్చి అది దోపిడికి గురైనట్లు తానే నాటకం ఆడానని, వీరాంజినేయులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకే ఇదంతా చేసినట్లు రాము పోలీసులు ఎదుట అంగీకరించాడు. రాముతో పాటు అతనికి సహకరించిన అందరిని పోలీసులు అరెస్ట్ చేశారు

Also read :అక్క కోసం కదులుతున్న బస్సు దిగుతూ..

Related posts

Share via