July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. తనిఖీల కోసం ఆపిన పోలీసులు.. లోపల బిత్తరపోయేలా

అసలే ఎన్నికల కాలం.. కొంచెం అనుమానం వచ్చినా ఆపి చెక్ చేయాల్సిందే.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫ్లయింగ్ స్క్వాడ్స్.. పోలీసుల బందోబస్తు, రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఇలా ఎన్నో ప్రాంతాల్లో పోలీసులు పకడ్బంధీగా డేగ కన్నుతో నిఘా పెట్టారు.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రలోభాలను నియంత్రించేందుకు ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ చర్యలు చేపట్టింది. ఎన్నికల నోటిఫికెషన్ విడుదల అయిన నాటినుంచి వేలాది కోట్ల రూపాయల నగదు, మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.. అంతేకాకుండా.. లెక్కా పత్రాలు లేని బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పట్టుబడిన డబ్బుతో పోలిస్తే.. ఈ సారి భారీగా నగదు పట్టుబడుతోంది.. 19 ఏప్రిల్ నుంచి జూన్ 1 2024 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తయింది.. నాలుగో విడతలో మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింంగ్ కు 10 రోజుల గడువు ఉండటంతో పోలీసులు డేగ కళ్లతో నిఘాపెట్టారు.

ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైవేపై నాలుగు కంటైనర్లలో రెండు వేల కోట్ల రూపాయల నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు. చివరకు ఈ డబ్బు ఆర్బీఐది అని తేలడంతో.. వదిలిపెట్టారు..

అనంతపురం జిల్లా గజరాంపల్లి దగ్గర తనిఖీల్లో పోలీసులు కంటైనర్లను ఆపి చెక్ చేయగా.. నగదు కనిపించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కంటైనర్లపై పోలీస్ స్టిక్కరింగ్ అని ఉన్నప్పటికీ.. ఎన్నికల డబ్బు అని అనుమానంతో పోలీసులు ఆపారు..

చివరకు విచారణ తర్వాత ఆర్బీఐ డబ్బుగా పోలీసులు గుర్తించారు. కంటైనర్లు కేరళ నుంచి హైదరాబాద్ వస్తున్నాయని.. పక్కా ఆధారాల ధృవీకరణ తర్వాత వదిలేశామని పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share via