April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఈజీ మనీ కోసం ఆరాటం.. ఈ మహిళామణులు చేసిన పని తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!



Rice pulling: రైస్ పుల్లింగ్ పేరుతో ప్రభుత్వ మహిళా టీచర్ ఘరానా మోసం చేసింది. కోటిన్నర స్వాహా చేసింది. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా స్టైల్‌లో ఈ రైస్ పుల్లింగ్ జరిగింది.

ఈజీ మనీ కోసం అనేక ఘరానా మోసాలకు పాల్పడుతూ ఉంటారు.  మోసాలందు రైస్ పుల్లింగ్ మోసాలే వేరయా అన్నట్లుగా ఓ మహిళ ప్రభుత్వ టీచర్ చేసిన ఘరానా మోసం ఇప్పుడు అందరిని నోటి మీద వేలు వేసుకునేలా చేస్తుంది. ఏకంగా కోటిన్నర నొక్కేసిందంటే ఆ టీచర్ ఘనత అర్థం చేసుకోవచ్చు.

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ టీచర్ శోభారాణి తన దూరపు బంధువు ఆయన బెంగళూరుకు చెందిన అపర్ణతో ఓ భారీ మోసానికి తెరలేపింది. దువ్వూరుకు చెందిన మూల వెంకటరమణారెడ్డి అనే వ్యక్తిని నమ్మించి మోసం చేశారు. విడతల వారీగా ఆయన వద్ద నుంచి దాదాపు రూ.కోటి 37 లక్షల రూపాయలను తీసుకుని మోసం చేశారు. రైస్ పుల్లింగ్‌కు సంబంధించిన పాత్ర ఉంటే జీవితం మారిపోతుందని అష్టైశ్వర్యాలు సకల సంతోషాలు కలుగుతాయని, చాలామంది ధనవంతుల దగ్గర అలాంటి పాత్రలు ఉండడంతో వారు కోట్లు సంపాదిస్తున్నారని వెంకటరమణారెడ్డిని నమ్మబలికించి మోసం చేశారు. అయితే అలాంటి వస్తువు వారి దగ్గర ఏమీ లేదని వెంకటరమణారెడ్డి తెలుసుకునే లోపే వారు ఈ మోసానికి ఒడిగట్టడంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరుకు చెందిన అపర్ణతో పాటు మరో ముగ్గురిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రొద్దుటూరు టూ టౌన్ సీఐ యుగంధర్ మీడియాకు వెల్లడించారు

Also read

Related posts

Share via