April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Watch Video: పూలతోటలో పత్తాపారం.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు..

పూలతోటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. గంజాయి సాగు చేసి అమ్మటానికి కాదంటున్నాడు. సాగు చేసిన గంజాయిని తానే సేవించేందుకు మంచి ప్లాన్ వేశాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామంలో.. ఓ పూల తోటలో గంజాయి సాగు గుట్టు బట్టబయలైంది. తమ గ్రామంలో అక్రమ మద్యం ఉందని ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్రమ మద్యం పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులు అక్కడ జరుగుతున్నది చూసి కంగుతిన్నారు. పూల తోటకు కాపలాగా ఉన్న వన్నూరు స్వామి అనే వ్యక్తి బంతిపూలు, కనకాంబరాల సాగు చేస్తున్నాడు. ఈ పూల చెట్ల మధ్య నాలుగు గంజాయి మొక్కలను కూడా అపురూపంగా పెంచుకుంటున్నాడు. అందరూ పూల వాసన పీలుస్తుంటే.. మనోడు గంజాయి పీలుస్తున్నాడు.

Also read :Andhra Pradesh: గుంత తీసి పాతి పెట్టడానికి సిద్దమయ్యాడు.. డామిట్ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది..!
పూల తోటలో గంజాయి సాగు చేస్తున్న తోటమాలి వన్నూరు స్వామి రోజుకు ఓ నాలుగ ఆకులు తెంపుకొని గంజాయి సేవిస్తున్నాడు. పూల తోట మధ్య గంజాయి సాగు చేస్తున్న విషయం చుట్టుపక్కల రైతులు చూసి పోలీసులకి సమాచారం ఇచ్చారా? లేక మనోడే గంజాయి మత్తులో ఎక్కడైనా వాగాడో తెలియదు గానీ.. మొత్తానికి పూల తోటలో గంజాయి సాగు బండారం బయటపడింది. అక్రమ మద్యం ఉందని వస్తే.. ఏకంగా గంజాయి సాగు పోలీసుల కంటబడింది. పూల తోటలో నాలుగు గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. పూల తోటలో ఉన్న గంజాయి మొక్కలు తొలగించి. దాదాపు 7.25 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న తోటమాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ట్విస్ట్ ఏంటంటే గంజాయి సాగు చేస్తున్న విషయం ఆ పూల తోట యజమానికి కూడా తెలియదు. దీంతో అశ్చర్యానికి గురవుతున్నాడు

Also read :ఖాకీ వనంలో గంజాయి మొక్కలు.. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..

Related posts

Share via