అలమూరు అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్వర్, విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ దేహశుద్ధి చేశారు. ఈ మేరకు పాఠశాల ఎదుట గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి వికృత చేష్టలకు పాల్పడ్డడాని తల్లిదండ్రులు ఆరోపించారు.
తల్లి,తండ్రి, గురవు, దైవం అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత రెండో స్థానం గురువులకే కేటాయించారు. ప్రేమతో పాఠాలు చెప్పాల్సిన అలాంటి టీచర్స్ విచక్షణ కోల్పోతున్నారు. స్కూల్స్‌లో కూడా చిన్నారులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇలాంటి దారుణ ఘటన ఒకటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.
నంధ్యాల జిల్లా పాణ్యం మండలం అలమూరు అప్పర్ ప్రైమరీ స్కూల్ చెందిన హెడ్ మాస్టర్ బరితెగించాడు. కళ్లు మూసుకుపోయిన విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు మూకుమ్మడిగా స్కూల్ వద్ద చేరుకుని హెడ్ మాస్టర్ ప్రవర్తనపై నిలదీశారు. అందరు కలిసి సదరు హెడ్ మాస్టర్‌కు దేహశుద్ధి చేశారు.
గత కొంత కాలంగా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూన్నాడంటు హెడ్ మాస్టర్ మల్లేశ్వర్‌ను చితకబాదారు. పరిస్థితి విషమించడంతో సహచర ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్‌ను అక్కడి నుంచి తప్పించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు అందోళన చేపట్టారు. హెడ్ మాస్టార్ మల్లేశ్వర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Also read
- పైకి చూసి ఇతను ఎంత అమాయకుడో అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులౌట్
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025





