April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

చెప్పాపెట్టకుండా కొండెక్కిన 40 మంది విద్యార్ధులు.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి అసలు సీన్..



అదో  అంబేద్కర్ గురుకుల పాఠశాల.. విద్యార్థులతో సందడి సందడిగా ఉంటుంది.. ఈ క్రమంలోనే విద్యార్థులంతా కొండ పైకి ఎక్కారు.. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది.. తర్వాత పోలీసులు వచ్చారు.. అసలేం జరిగిందంటే..




అదో  అంబేద్కర్ గురుకుల పాఠశాల.. విద్యార్థులతో సందడి సందడిగా ఉంటుంది.. ఈ క్రమంలోనే విద్యార్థులంతా కొండ పైకి ఎక్కారు.. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది.. అసలేం జరిగిందంటే.. పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలంలోని వంకాయల పాడులో ఉన్న గురుకుల పాఠశాల విద్యార్ధులు ఎప్పటి లాగే హాస్టల్ నుండి స్కూల్ కు వచ్చారు. స్కూల్, హాస్టల్ పక్కపక్కనే.. పచ్చని కొండ మధ్యలో ఉంటాయి. అయితే ఈ రోజు స్కూల్ కు వచ్చిన 40 మంది విద్యార్ధులు ఒక్కసారిగా స్కూల్ నుంచి వెళ్లిపోయారు. నలభై మంది విద్యార్దులు వెళ్లిపోవడంతో స్కూల్లో కలకలం మొదలైంది. అలా వెళ్లిపోయిన విద్యార్ధులంతా పక్కనే ఉన్న కొండెక్కినట్లు ఉపాధ్యాయులు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కొండెక్కి అక్కడున్న విద్యార్ధులతో మాట్లాడారు. అయితే అసలు కొండపైకి ఎందుకెళ్లారంటూ పోలీసులు ప్రశ్నించారు. దీంతో విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.


స్కూల్ ప్రిన్సిపాల్ హనుమంతరావు తరుచూ వేధిస్తున్నాడని చిన్న చిన్న విషయాలకే తమను కొడుతున్నాడని విద్యార్ధులు చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బా నాయుడుకి చెప్పారు. ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేకే ఇక్కడికి పారిపోయి వచ్చామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధుల సమస్య తెలుసుకున్న పోలీసులు వెంటనే వారందరిని బుజ్జగించి కొండదించారు. అదే సమయంలో నర్సరావుపేట డిఎస్పీ నాగేశ్వరావు కూడా అక్కడకి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు.


స్కూల్ చుట్టూ ప్రహారి గోడ ఉంది. గేటు వద్ద వాచ్ మెన్ కాపలా ఉంటున్నాడు. అయినా కొండపైకి ఎలా వెళ్లారంటూ ప్రశ్నించగా.. గోడ దూకి వెళ్లినట్లు విద్యార్థులు తెలిపారు. దీంతో డిఎస్పీ నాగేశ్వరావు అటు టీచర్లను ఇటు విద్యార్ధులను.. అందరినీ మందలించారు. చిన్న చిన్న విషయాలకే విద్యార్ధులను కొట్టవద్దని ఉపాధ్యాయులకు సూచించారు. అదే విధంగా విద్యార్ధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. అయితే 40 మంది విద్యార్ధులు పారిపోయి కొండెక్కడం వెనుక ఎవరైనా ఉన్నారా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read

Related posts

Share via