April 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

NTR District: తండ్రిని చంపారని బోరుమన్న కొడుకు.. రోడ్డుపై రాస్తారోకో.. కట్ చేస్తే.. విచారణలో

పొలం సరిహద్దు తగాదా నేపథ్యంలో తన తండ్రిని హత్య చేశారనిని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం మొర్సుమల్లి శివారు ములకలపెంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి లేకుండా తాను బతకలేనని బావురుమన్నాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిశాయి.


ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని ములకలపెంట గ్రామంలో జరిగిన హత్యలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8న పంట పొలం దగ్గర కడియం శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద స్థితిలో మొక్కజొన్న తోటలో శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేశారు. భూ తగాదాలే హత్యకు కారణమని.. టీడీపీ నేత చల్లా సుబ్బారావు అతని అనుచరులే చంపారని కొడుకు పుల్లారావు.. హత్య జరిగిన రోజు ఆందోళన చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కట్ చేస్తే.. కొడుకు పుల్లారావే తండ్రి శ్రీనివాసరావుని హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందంటున్నారు పోలీసులు. ఎంబీఏ చేసిన పుల్లారావు చదువుకునే సమయంలో.. పేకాట, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడ్డారని ఏసీపీ ప్రసాదరావు చెప్తున్నారు. అప్పులు చేయడంతో తండ్రి శ్రీనివాసరావు, పుల్లారావును ఇంటికి తీసుకొచ్చి వ్యవసాయం చేయిస్తున్నాడని.. ప్రతి చిన్నదానికి తండ్రిపై డిపెండ్ కావడం, ఇంట్లో గొడవలతో తండ్రిని హత్య చేసినట్లు తేలిందన్నారు.

అయితే తన భర్తను కావాలనే.. కేసులో ఇరికించారంటున్నారు. తన మామకు, భర్తకు ఎటువంటి గొడవలు లేవని చెప్పడం.. ఇక్కడ మరో ట్విస్ట్‌గా మారింది. తమకు ఇద్దరు పసిపిల్లలని..అధికార పార్టీ నేతల ఒత్తిడితో భర్తను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆమె బావురుమంటున్నారు

Also read

Related posts

Share via