రాజమండ్రి సెంట్రల్ జైలు.. భారీ భద్రత.. అయినా కానీ.. వాళ్లేం బెదరలేదు.. ముందే ప్లాన్ చేశారు.. కారు ను సిద్ధం చేశారు.. జైలు నుంచి అలా విడుదల కాగానే.. అలా ఎత్తుకెళ్లారు.. ఈ షాకింగ్ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర జరిగింది.. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన వ్యక్తిని.. కొందరు వ్యక్తులు సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది..
ఒడిషాకు చెందిన నిందితుడు సంజయ్‌కు బెయిల్ రావడంతో అధికారులు బుధవారం జైలు నుంచి విడుదల చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కొందరు దుండగులు నడిరోడ్డుపై సంజయ్‌పై దాడిచేసి కారులో కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి.. ఈ వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ చేసిన వ్యక్తులు కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలానికి చెందిన పినిశెట్టి బాబి, అబ్బులు, స్వామి నాయుడు, షేక్‌లాల్ జానీ, మరికొందరు వ్యక్తులుగా గుర్తించారు. వీరికి నిందితుడు కోట్ల రూపాయలు బాకీ ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు.. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సెంట్రల్ జైలు బయటకి బెయిల్ పై వస్తున్న సంజయ్ పై దాడి చేసి, కత్తితో బెదిరించి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బెయిల్ వస్తుందన్న విషయం తెలిసి కొన్ని గంటల నుంచి సెంట్రల్ జైలు బయటే కిడ్నాపర్లు ఉన్నారని.. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ ఘటన జరిగిందని తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025