ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో ఈ సారి నామినేషన్లు భారీగా దాఖలు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఎంపీ స్థానాలకు 203మంది, అసెంబ్లీ స్థానాలకు 1వెయ్యి,123 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
ఏఫ్రిల్ 18న నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా, బుధవారం నాటికి ఎంపీ స్థానాలకు 555 మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు 3వేల84 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ్టి ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా..రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.. అయితే చివరిరోజు కావడంతో నేడు మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.
మరోవైపు నేడు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడపకు చేరుకుంటారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో భాకరపురం చేరుకుంటారు. అనంతరం CSI గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగిస్తారు. పబ్లిక్ మీటింగ్ అనంతరం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఉదయం 11 గంటలకు జగన్ తన నామినేషన్ దాఖలు చేస్తారు.
Also read
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!
- చెప్పులు వేసుకుని స్కూల్కు వచ్చిందనీ.. చెంపపై కొట్టిన ప్రిన్సిపాల్! విద్యార్థిని మృతి