తండ్రి కూతుళ్ల బంధం అనేది ఒక ప్రత్యేకమైన బంధం. నవమాసాలు మోసి తనకు జన్మనిచ్చిన తల్లి కంటే.. తండ్రి అంటే కూతురికి ఆపేక్ష. తండ్రి-కూతుళ్లు మధ్య ఫ్రెండ్స్ మాదిరిగా బాండింగ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తన ఎంతో కష్టపడి పెంచిన తండ్రికి ప్రయోజకురాలైన కూతురు గిఫ్ట్ ఇచ్చి.. తండ్రి కలను నెరవేర్చాలనుకుంది. కానీ అంతలోనే పెను విషాదం జరిగిపోయింది. ఇంతకు కూతురు తన తండ్రికి గిఫ్ట్ ఇచ్చిందా..? ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి..
వివరాల్లోకి వెళితే….
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తందూరుకు చెందిన చేడె జనార్దన్‌కు కూతురు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో ఇద్దరు పిల్లలను జనార్ధన్ చదివించాడు. దీంతో బాగా చదువుకున్న పిల్లలు ఇప్పుడు ప్రయోజకులయ్యారు. కూతురు యశస్విని హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీడబ్ల్యూసీ కంపెనీలో మూడు సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. తనను ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకురాలిగా చేసిన తన తండ్రికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని భావించింది. గ్రామంలో ఉండే తన తండ్రి బుల్లెట్ పై తిరుగుతుంటే చూడానుకుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ షోరూంలో బుల్లెట్ బైక్ ను కొనుగోలు చేసింది. బుల్లెట్ ను తండ్రికి ఇచ్చేందుకు తన సహా ఉద్యోగి బడ్డుకొండ అచ్యుత్ కుమార్ తో కలిసి అదే బుల్లెట్ బైక్ పై తమ స్వగ్రామమైన తందూరుకు బయలుదేరింది.
ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడి ఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టి వాళ్లు ప్రయానిస్తున్న బైక్ కిందపడిపోయింది. దీంతో బైక్ పై ఉన్న యశస్విని ఎగిరి రోడ్డుపై పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ఓలారీ అతివేగంగా వచ్చి రహదారిపై పడిఉన్న యశస్విని మీదుగా వెళ్లింది. దీంతో యశస్విని తల, మెడభాగం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బైక్ నడుపుతున్న అచ్యుత్ కుమార్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న యశస్విని బాబాయ్ చేడె సురేష్ మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించారు. ఆతర్వాత పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంతో తండ్రికి బుల్లెట్ బైక్ ఇచ్చి.. ఆయన కళ్లలో ఆనందం చూడాలనుకున్న కూతురి కల కలగానే మిగిలిపోయింది. తండ్రి బుల్లెట్ బైక్‌పై తిరుగుతుంటే చూడాలని ఎంతో ఆశగా సొంతూరుకు వస్తున్న కూతురి గమ్యాన్ని చేరుకోకుండానే ప్రాణాలు కోల్పోయింది. ఎన్నో రోజుల తర్వాత కూతురు సొంతూరికి వస్తుందన్న తల్లిదండ్రుల ఆనందం ఆవిరైంది
Also read
- Andhra News: తండ్రి కోసం బుల్లెట్ బైక్ కొన్న కూతురు.. కానీ బైక్ తండ్రికి ఇచ్చేలోపే….
- Wearing Toe Rings: వివాహిత స్త్రీ కాలి మెట్టెలు పోగొట్టుకుంటే.. భర్తకు సంబంధించిన ఈ సంకేతాలకు సూచనట
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు
- మూడు రోజుల కిందట చిన్నారి, ఇప్పుడు చిన్నారి తల్లి, అమ్మమ్మ మృతి..! అసలు ఏం జరిగిందంటే..?
- అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి