April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

సాగినన్ని రోజులూ సాగించాడు.. 15 ఏళ్ళలో ఓ దొంగోడి ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. !

జీవితంలో ఏం చేసావంటే చెప్పుకోవటానికి కొన్ని మంచి పనులైనా ఉండాలి. అలా మంచిపనులు సమాజ హితం కోసం పనిచేసిన వ్యక్తులకు ఆత్మ తృప్తి కలుగుతుంది. ఇక చెడు ప్రవర్తన, నేర స్వభావం కలిగిన వ్యక్తుల జీవితాలు సైతం సాగినన్ని రోజులు సాగుతాయి. చివరకు ఎదోక రోజు ఎదురు దెబ్బ తగిలితే జీవితం మొత్తం తలకిందులవుతుంది. అప్పుడు ఆత్మ తృప్తికి మారుగా ఆత్మ విమర్శ చేసుకోవలసిన పరిస్థితి ఎడురవుతుంది.

అపుడు దాక గర్వగా చెప్పుకున్న వన్ని అవిరిలా మారి కనిపించకుండా పోతాయి. దారి మొత్తం మోసుకుపోయి చేసిన తప్పులకు , నేరాలకు శిక్ష అనుభవించటంతో జీవితం ముగిసిపోతుంది. ఇపుడ ఇదంతా ఎందుకంటారా..? ఓ యువకుడు మొత్తం 15 సంవత్సరాల్లో 57 చోరీలు చేశాడు. అతనికి చిన్నతనం నుంచే నేరాలు చేయటం మొదలైంది. కానీ జువైనేల్ జైలుకు వెళ్లి వచ్చినా అతడిలో మార్పు మాత్రం రాలేదు. చివరికి పాపాలు పండి మరోసారి అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.

పశ్చిమ గొదావరి జిల్లా భీమవరం గునుపూడికి చెందిన పందిరి వెంకట నారాయణ్ అలియాస్ నారి అలియాస్ బుచ్చి చిన్న ఏలేశ్వరం కళాశాల రోడ్‌లో నివసిస్తున్నాడు. చిన్నతనం నుంచి చెడు వ్యసనాలకు, జూదానికి బానిస అవ్వటంతోపాటు మద్యానికి బానిసగా మారాడు. ఇక 15 ఏళ్ళ వయస్సులోనే సైకిల్ దొంగగా మారి అప్పటి నుంచి వరుసగా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. మైనర్‌గా జువైనల్ హోమ్‌కు వెళ్లి వచ్చాడు. అయితే అతడిలో మార్పు మాత్రం రాలేదు. మళ్లీ దొంగతనాలు చేయటం మొదలు పెట్టి, ఇప్పటి వరకు 57 దొంగతనాలు చేశాడు. పైగా జైలుకు వెళ్ళిన సమయంలో ఇతర నేరస్తులతో ఏర్పడిన పరిచయాలతో ఇంటిదొంగ గా మారాడు. ఇలా ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో ఇళ్ల చోరీలకు పాల్పడి జైలుకు వెళ్ళటం, బయటకు వచ్చి నేరాలు చేయటం ఇదే వృత్తిగా మార్చుకున్నాడు. ఇక దొంగతనం చేసిన బంగారు వస్తువలను తనఖా పెట్టి వచ్చిన డబ్బుతో బెట్టింగ్స్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు.

కొన్ని రోజల క్రితం ఉండ్రాజవరానికి చెందిన ఒక మహిళ ఇంట్లో 10 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ కేసులో నిడదవోలు సిఐ తిలక్ బృందం ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా నిందితుడు వెంకట నారాయణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో భాగంగా అతడి నుంచి ఉండ్రాజవరం, సమిశ్రగూడెం, పెనుమంట్ర, ఐనవల్లి, పెరవలి, రావులపాలెం , భీమడోలు మొత్తం 12 ప్రాంతాల్లో జరిగిన చోరీలకు సంబంధించి రూ. 50 లక్షల విలువ చేసే బంగారం, రూ. 3.60 లక్షల విలువైన 4 కేజీల వెండి, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

చదివారుగా జీవితంలో ప్రతిఒక్కరికి కష్టాలు ఎదురవుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి. కానీ అందరు నేరస్తులుగా మారరు. కొందరు చదువుకుని, మరికొందరు కష్టపడి పైకి వస్తారు. కాని అడ్డదారుల్లో బ్రతకాలి అనుకునే వారి జీవితాలు మాత్రం చివరకు జైలు పాలు అయి విషాదం ముగింపుతో పూర్తి అవుతాయి

Also read

Related posts

Share via