SGSTV NEWS
Andhra PradeshCrime

కాకినాడ: బైక్‌లో పెట్రోల్ కొట్టించుకున్నాడు.. అర కిలోమీటరు వెళ్లగానే ఆగిపోయింది.. ఏంటా అని చూడగా



కాకినాడ భారత్ పెట్రోలియం బంక్‌లో పెట్రోల్‌తో పాటు నీళ్లు రావడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి విసిగిపోయిన కస్టమర్లు మూడు గంటలపాటు ఆందోళన కొనసాగించారు. ఇదే తరహా ఘటన తునిలోనూ జరగడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ..




పెట్రోల్ బంక్‌కి వెళ్లి ఇంధనం పోసించుకున్న వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బంక్ నుంచి పెట్రోల్‌కి బదులుగా నీళ్లు రావడంతో వాహనాలు కొంతదూరం వెళ్లగానే ఆగిపోయాయి. కాకినాడలోని భారత్ పెట్రోలియం బంక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బంక్ సిబ్బందిని ప్రశ్నిస్తే.. తమకు సంబంధం లేదని ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసుకోమని చెప్పడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్ వద్దే మూడుగంటలపాటు ఆందోళన కొనసాగింది.

కేవలం కాకినాడలోనే కాదు, ఇటీవల తునిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి పెట్రోల్ బంక్‌లో కూడా పెట్రోల్‌తో పాటు నీళ్లు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. వర్షం వల్ల ట్యాంక్‌లోకి నీళ్లు చేరాయి అని చెప్పి సదరు బంక్ నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.

ఇంధన నాణ్యతపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి బంక్‌లపై కంట్రోల్ లేనందుకు అధికారులపైనా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. నాణ్యత లేకపోవడం ప్రజలలో ఆవేదన కలిగిస్తోంది

Also read

Related posts