ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతుంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో పొలం గట్టుపై తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణవార్త విన్న కుటుంబసభ్యులుల కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతుంది. ఈ తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లాలో ఒక రైతు ప్రాణాలు కోల్పోయాడు. తుఫాన్ ప్రభావంతో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వంగర మండలం కొండచారాపల్లిలో విద్యుత్ వైర్లు తెగి పొలం గట్టుపై పడిపోయాయి. అయితే అదే గ్రామానికి చెందిన వెంకటరమణా అనే రైతు పోలానికి వెళ్లి.. ఇంటికి తిరిగి వస్తుండగా ఆ విద్యుత్ వైర్లు అతని కాలికి తగిలాయి. దీంతో కరెంట్ షాక్‌కు గురై వెంకటరమణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
అటుగా వెళ్తున్న గ్రామస్తులు వెంకటరమణ మృతదేహాన్ని గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న వెంకటరమణ కుటుంబ సభ్యులు అతని మృతదేమాన్ని చూసి గుండెలుపగిలేలా రోధించారు. ఇక సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని తెగిపడిన విద్యుత్ తీగలను తొలగించారు.
మరోవైపు రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని.. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈదురుగాలుల కారణంగా విద్యుత్‌వైర్లు తెగిపడే ప్రమాదం ఉందని.. ఎక్కడైనా వైర్లు తెగినట్టు కనిపిస్తే వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Also read
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
 - అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
 - Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
 - Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..
 - Telangana: ఆదివారం సెలవు కదా అని బంధువుల ఇంటికి బయల్దేరారు.. కొంచెం దూరం వెళ్లగానే
 





