విశాఖపట్నంలో జరిగిన ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. నిందితుడు నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రి గతంలోనూ ఇలాంటి దాడి జరిగిందని తెలిపారు. త్వరిత న్యాయం కోసం డిమాండ్లు వస్తున్నాయి. సీఎం కూడా ఈ కేసుపై సీరియస్‌గా ఉన్నారు.
విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. విశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దాడి కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితుడు నవీన్‌ను అరెస్ట్ చేశారు. అతన్ని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కేసుపై సీరియస్ అయినట్లు సమాచారం.
బాధితురాలికి మెరుగైన చికిత్స అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. దీంతో.. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ ద్వారా త్వరగా శిక్షపడేలా చూస్తామని సీపీ అన్నారు. కాగా నవీన్ కత్తితో దాడి చేయడంతో స్పాట్‌లోనే చనిపోయిన యువతి తల్లి లక్ష్మి మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రేమ పేరుతో నవీన్ గతంలో తమ కూతురిపై దాడి చేశాడని బాధితురాలి తండ్రి వెల్లడించారు. అప్పట్లో నవీన్ భవిష్యత్తు నాశనం అవుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, పెద్దల సమక్షంలో పంచాయతీతో ఆగిపోయామని అన్నారు. కానీ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన నవీన్‌కు ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేశారు యువతి తండ్రి.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!