విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల స్కామ్‌పై అధికారులు విచారణ చేపట్టారు. ఆలయంలో పలు రకాల ఫైల్స్ సేకరించిన ఎండోమెంట్ ఆఫీసర్స్.. దుర్గమ్మ చీరల దొంగలను పని పట్టేందుకు రెడీ అవుతుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. . కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక విజయవాడ దుర్గగుడిలో ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టింది.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోని అమ్మవారి చీరల కుంభకోణంపై మరోసారి ఎంక్వైరీ కొనసాగుతోంది. ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ నియమించిన ప్రత్యే కమిటీ.. ఇంద్రకీలాద్రికి చేరుకుని చేరుకుని అమ్మవారి శారీస్ స్కామ్ లెక్కలు తేల్చేందుకు వివరాలు సేకరించారు. ఆలయంలోని ఫైల్స్‌ను సేకరించిన అధికారులు.. వాటి ఆధారంగా ఇవాళ కూడా విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. 2018-19 సంవత్సరంలో సుమారు 1.68కోట్ల విలువైన చీరలకు సంబంధించిన లెక్కల్లో అవకతవకలు జరిగాయని అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారి సురేష్‌బాబు.. ఆ విభాగానికి సంబంధించిన గుమస్తా సుబ్రహ్మణ్యంపై సస్పెన్షన్ వేటు వేశారు. సురేష్‌బాబు తర్వాత ఈఓగా పనిచేసిన భ్రమరాంబ కూడా చీరల స్కామ్ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఏఈఓ సుధారాణి విచారణాధికారిగా ఎంక్వైరీ పూర్తి చేసి నివేదికను రూపొందించారు. దాని ప్రకారం లెక్కల్లో అవకతవకలు ఉన్నాయని నిర్ధారించారు.
ఏకంగా పదుల సంఖ్యలో చీరలు కనిపించకుండా పోయాయని అధికారులు తేల్చారు. చీరల విభాగంలో పక్కదారి పట్టించిన 1.68 కోట్లను తిరిగి దేవస్థానానికి తిరిగి కట్టించాలని కమిటీ సూచించింది. అప్పట్లో సస్పెండ్ అయిన గుమస్తా సుబ్రహ్మణ్యంకి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ.. అతను కోర్టును ఆశ్రయించడంతో మరోసారి నోటీసు ఇచ్చి సంజాయిషీ తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. మారిన రాజకీయ పరిణామాలతో కొందరు పెద్దలను ప్రసన్నం చేసుకుని మళ్లీ విధుల్లో చేరిపోయారు.
పక్కాగా ఆధారాలతో అక్రమాలు తేలినా ఒక్క రూపాయి కట్టించకపోవడంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. గుమస్తా సుబ్రహ్మణ్యం మాత్రం దేవస్థానానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా 5కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో.. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక విజయవాడ దుర్గగుడిలో ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టింది. సదరు కమిటీ విచారణ కోసం ఇంద్రకీలాద్రికి వెళ్లడంతో దుర్గమ్మ చీరల స్కామ్ ఆసక్తి రేపుతోంది.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు