తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే టీడీడీ ఉద్యోగులు, అధికారులను విచారించింది. ఈ క్రమంలోనే.. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) నోటీసులు ఇచ్చింది.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే టీడీడీ ఉద్యోగులు, అధికారులను విచారించింది. ఈ క్రమంలోనే.. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా రెండు రోజుల నుంచి సిట్ అధికారులు అప్పన్నను ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో ఆరుగురు తిరుమల ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. వారితో కలిపి అప్పన్నను సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.. కాగా.. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.
వాస్తవానికి మే నెల 15 నాటికి దర్యాప్తు ముగించి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉంది.. దర్యాప్తు పూర్తి కాకపోవడంతో గడువును మరో రెండు నెలలు పొడగించారు. కల్తీ నెయ్యి సరఫరాలో ఉత్తరాఖండ్ బోలెబాబా డెయిరీ జీఎం హరిమోహన్ రానా కీలకపాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న హరి మోహన్‌ను మార్చి 20న సిట్ అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న.. అలాగే ఉద్యోగుల విచారణ కీలకంగా మారింది.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!