SGSTV NEWS
Andhra PradeshCrime

Chittoor: ఇద్దరు వ్యక్తులు, నలుగురు మహిళలు.. గుడి పక్కన గుట్టుచప్పుడు యవ్వారం.. సీన్ కట్ చేస్తే.!



ఇద్దరు యువకులు.. నలుగురు యువతులు.. చిత్తూరులోని ఓ గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారాన్ని కానిస్తున్నారు. కట్ చేస్తే.! పోలీసుల ఎంట్రీతో దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అదేంటి.? ఆ గ్రామం ఏంటి.? వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓసారి లుక్కేయండి.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని ఒక గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న యవ్వారాన్ని పోలీసులు బయట పెట్టారు. చెర్లోపల్లిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి చేశారు. ఒక ఇంటిని అద్దెకు తీసుకుని దాదాపు రెండేళ్లుగా రహస్యంగా వ్యభిచారం చేయిస్తున్న విజయ అనే మహిళ యవ్వారాన్ని బయట పెట్టారు. గ్రామస్తులకు తెలిసినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో గుడి పక్కనే సాఫీగానే నడుస్తూ వచ్చింది. గంగాధర నెల్లూరు సీఐ వాసంతికి సమాచారం రావడంతో రంగంలోకి దిగింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న యవ్వారాన్ని బయట పెట్టింది.

గంగాధర నెల్లూరు మండలం బాలగంగన్నపల్లికి చెందిన విజయ అనే మహిళ ఈ వ్యభిచార గృహానికి నిర్వాహకురాలని పోలీసులు గుతించారు. గతంలోనూ చిత్తూరు, జీడి నెల్లూరులో ఇలాంటి వ్యభిచార గృహాలను నిర్వహిస్తూ విజయ పట్టుబడింది. పలు ప్రాంతాల నుంచి యువతులను పిలిపించి షెల్టర్ ఇస్తున్న విజయ.. గత కొంతకాలంగా ఈ పనిలోనే ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ మేరకు విజయపై నిఘా పెట్టిన పోలీసులు చెర్లోపల్లిలోని గుడి పక్కనే ఇంటిలో యువతులను ఉంచి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నిర్వాహకురాలు విజయతో పాటు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. తిరుపతి, కుప్పం, తమిళనాడుకు చెందిన యువతులుగా గుర్తించిన పోలీసులు.. దాడి సమయంలో పరారైన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ వాసంతి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts

Share this