Srikakulam: ఈ దొంగ తెలిసిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్వర్టర్ కోసం రాలేదని, ఏవైనా కీలకమైన డాక్యుమెంట్లు దొంగలించడానికి వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆఫీస్ కోసం తెలిసిన వ్యక్తిగా కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే దొంగతనంలో ఏదో కుట్ర కోణం కూడా దాగి ఉందని..
ఇళ్లల్లోనో, బ్యాంకులు, దుకాణాలు, షాపులలోనో దొంగతనాలు జరగటం సహజం. ఎందుకంటే వాటిల్లో దొంగతనంకి పాల్పడితే డబ్బులు, బంగారు,వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు దొరుకుతాయి. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగతనానికి పాల్పడితే ఏం దొరుకుతాయి. రికార్డులు,ఫైల్స్, వంటివి తప్పితే అక్కడ ఏమి ఉంటాయని అనుకుంటారు. కానీ కొందరు ప్రబుద్ధులు రికార్డులు మార్చేయటానికి, ఫైల్స్ ను మాయం చేయటానికి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు.
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోనీ ఎంపీడిఒ కార్యాలయంలో గురువారం దొంగతనం జరిగింది. అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఎంపీడీవో (MPDO) కార్యాలయంలోకి ప్రవేశించి ఆఫీసులో గల గదులన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఒక టేబుల్ లో ఉన్న తాళాలను తీసుకొని పక్కనున్న గదిని ఓపెన్ చేశాడు. ఆ గది లోకి ప్రవేశించి కొంత సమయం అన్ని వెదికాడు. చివరకు ఆఫీసులోని ఇన్వర్టర్, బ్యాటరీలను దొంగలించారని ప్రాథమిక విచారణలో బూర్జ పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ దొంగ తెలిసిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇన్వర్టర్ కోసం రాలేదని, ఏవైనా కీలకమైన డాక్యుమెంట్లు దొంగలించడానికి వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆఫీస్ కోసం తెలిసిన వ్యక్తిగా కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతిపక్షం వైసీపీ పార్టీ మాత్రం ఎంపీడీఓ ఆఫీస్ లో జరిగిన దొంగతనంలో ఏదో కుట్ర కోణం కూడా దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తి తనను ఎవరు గుర్తు పెట్టలేకుండా మాస్క్ వేసుకొని, క్యాప్ పెట్టుకొని ఉన్నాడు. వ్యక్తి చీరీకి పాల్పడిన వ్యవహారం అంతా కార్యాలయం లోని CC కెమెరాలో రికార్డ్ అయింది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. CC కెమెరా దృశ్యాలు ఆధారంగా విచారణ చేపడుతున్నారు
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..