SGSTV NEWS online
Andhra PradeshCrime

సార్లు విమానంలోనే ఏపీకి వస్తారు.. మళ్లీ విమానంలోనే వెళ్లిపోతారు.. ఇంతకీ పనేంటో తెల్సా..!

 


సామాన్యూడు విమానం ఎక్కాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు. ఎందుకుంటే విమాన టికెట్ ధరలు అధికంగా ఉండటమే అందుకు కారణం..! అయితే వాళ్లు మాత్రం ఎవరికి అనుమానం రాకుండా విమానాల్లో ప్రయాణిస్తారు. బాగా రిచ్ అనుకునేలా ప్రవర్తిస్తారు. చివరికి చేసేదీ మాత్రం రైళ్లలో చెయిన్ స్నాచింగ్. అవును నిజమే అస్సాం నుండి విమానంలో వచ్చి రైలులో చెయిన్ స్నాచింగ్ చేసి తిరిగి విమానంలోనే అస్సాం వెళ్లిపోతారు. ఇది ఆ గ్యాంగ్ స్టైయిల్..! అటువంటి గ్యాంగ్ ను గుంటూరు రైల్వే పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగలిగారు.


అస్సాంకు చెందిన సంజు పదిహేను మందితో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన వీరంతా జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో పరిచయం అయిన వారే.. అయితే వీరు చేసే పని మాత్రం చెయిన్ స్నాచింగ్… ఈ మధ్య కాలంలో గుంటూరు జిల్లా క్రిష్ణా జంక్షన్ వద్ద తరుచు రైళ్లలో చెయిన్ స్నాచింగ్ లు జరుగుతున్నాయి. దీనిపై ప్రయాణీకుల్లో ఆందోళన మొదలైంది. క్రిష్ణా కెనాల్ జంక్షన్ వద్దకు రాగానే రైళ్లు స్లో అవుతాయి. ఆ సమయంలో కిటీకిల వద్ద కూర్చున్న మహిళా ప్రయాణీకుల మెడలోని బంగారు చెయిన్లు తెంపుకుని పారిపోతున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుండి గుంటూరు జిల్లా రైల్వే పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీనిపై ప్రత్యేక ద్రుష్టి సారించారు. వివిధ పోలీస్ రికార్డులు పరిశీలించి, సీసీ కెమెరాల విజువల్స్ సేకరించి ఈ తరహా చెయిన్ స్నాచింగ్ లకు పాల్పడుతుంది అస్సాంకు చెందిన సంజు గ్యాంగే అని గుర్తించారు.

వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక వేసుకున్నారు. ముందుగా సంజును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన ఆర్మీ రిజర్వ్ మాజీ జవాన్ సతేందర్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరిస్తున్న రాజస్థాన్ కు చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి, వీరి వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. పోలీస్ దర్యాప్తులో అనేక అంశాలు వెలుగు చూశాయి. 2015 నుండి రైళ్లలో చెయిన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఈ ముఠాను ఒక్కసారి మాత్రమే తమిళనాడు పోలీసుల అరెస్ట్ చేయగలిగారు. ఆతర్వాత గుంటూరు పోలీసుల చేతికే చిక్కారు.


రైళ్లలో ప్రయాణిస్తూ కిటీకిల వద్ద కూర్చున్న మహిళా మెడలోని చెయిన్ తెంచుకొని పారిపోతుంటారు. ఒకవేళ ఎవరైనా పట్టుకోవాలని చూస్తూ మిగిలిన వారు అక్కడకు చేరుకుని వారిపైనే దాడికి దిగుతారు. ముందుగా ఏ రాష్ట్రంలో స్నాచింగ్ కు పాల్పడాలో నిర్ణయించుకుని అక్కడికి విమానంలో వస్తారు. చెయిన్ స్నాచింగ్ కు పాల్పడిన తర్వాత తిరిగి విమానంలోనే అస్సాంకు వెళ్లిపోతారు. వివిధ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ పై పలు కేసులున్నట్లు రైల్వే డిఎస్పీ అక్కేశ్వరావు తెలిపారు

Also read

Related posts