SGSTV NEWS online
Andhra PradeshCrime

MP Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్.. ఏ జైలుకు అంటే..?




ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. అగస్టు 1వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కాసేపట్లో ఎంపీని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు.


ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. అగస్టు 1వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ని సిట్ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. శనివారం మిథున్ రెడ్డి విచారణకు హాజరవ్వగా.. 6గంటలకు పైగా విచారణ తర్వాత సిట్ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఇవాళ ఉదయం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మిథున్ రెడ్డికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు చెప్పడంతో ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టులో ఇరుపక్షాల మధ్య హోరాహోరీ వాదనలు జరిగాయి.


ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి నుంచి మరిన్ని ఆధారాలు రాబట్టాల్సి ఉందని.. పోలీస కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున ఆయనను గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ విధించాలని సిట్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగవున్నారని.. భద్రతా దృష్ట్యా ఆయన్ని నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అంతేకాకుండా మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్‌గా పనిచేశారని.. ఆయన అరెస్ట్ గురించి స్పీకర్‌కు సమాచారం ఇవ్వలేదని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. అగస్టు 1వరకు రిమాండ్ విధించింది.

రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కీలక విషయాలను ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టం ఉందంటూ.. ఆయన్ని కుట్రదారుడిగా సిట్ పేర్కొంది. లిక్కర్ పాలసీ మార్పు, అమలు, డిస్టిలరీలు, సప్లయర్స్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లుగా ఆరోపించారు. అంతేకాకుండా లిక్కర్ డబ్బును 2024 ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. మిథున్ రెడ్డి కుట్రలతో ప్రభుత్వానికి రూ.3500 కోట్ల నష్టం వచ్చినట్లు చెప్పారు. ఆయన్నీ కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని.. అందుకే రిమాండ్ విధించాలని సిట్ కోర్టును కోరింది

Also read

Related posts