ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ వ్యక్తి 12కోట్ల మోసానికి పాల్పడ్డ ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. అధిక వడ్డీకి ఆశ పడి.. మోసపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయంటూ సోమశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి.. వైఎస్సార్ కడప జిల్లాలో స్నేహితులను, తెలిసినవారిని నమ్మించి మోసం చేశాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అధిక వడ్డీ ఆశ చూపెట్టి సుమారు 40 కుటుంబాల నుండి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. షేర్ మార్కెట్లో 10 లక్షలు పెట్టుబడి పెడితే నెలనెలా వడ్డీ రూపంలో 40 వేలు తిరిగి ఇస్తానని బాధితులను నమ్మించాడు. ప్రాంశరీ నోట్లు, అగ్రిమెంట్లు రాసి ఇచ్చాడు. అయితే.. రెండు, మూడు నెలలు సక్రమంగా డబ్బులు ఇచ్చిన సోమశేఖర్‌రెడ్డి.. ఆ తర్వాత స్పందించకపోవడంతో రోడ్డెక్కారు బాధితులు. ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగితే బెదిరిస్తున్నాడని వాపోతున్నారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సోమశేఖర్‌రెడ్డి ఫ్యామిలీ, అతని ఫ్రెండ్ నిరంజనిరెడ్డి మాయమాటలు చెప్పి విడతలవారీగా డబ్బులు తీసుకొని పారిపోయారు. ప్రస్తుతం పెట్టుబడి పెట్టినవారిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమకు న్యాయం చేయాలని కడప జిల్లా ఎస్పీకి, హోం మంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు. బాధితుల ఫిర్యాదుతో కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక.. సోమశేఖర్‌రెడ్డి ఫ్యామిలీ, అతని ఫ్రెండ్ నిరంజనిరెడ్డి పరారీలో ఉన్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు బాధితులు. షేర్ మార్కెట్‌లో పెడతానని నమ్మించడంతో ఎనిమిదిన్నర కోట్ల రూపామలు ఇచ్చి మోసపోయానని బాధితుడు జగదీశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు
Also read
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!