మచిలీపట్నంలో వరుస దొంగతనాలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. దొంగతనం చేసిన తీరు తెలుసుకుని ఇలా కూడా ఉంటారా..? అంటూ కంగుతిన్నారు. దొంగతనం ఎలా చేశారు.? చోరీ చేసిన సొత్తుతో ఏమి చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాలు ఇలా..
వేరు వేరు దొంగాతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి.. వారి నుంచి 100 గ్రాముల బంగారం, 700 గ్రాముల విలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు మచిలీపట్నం పోలీసులు. ఈ నెల 6వ తారీఖున RTC కాలనీ, మచిలీపట్నంలో మహంకాళి గురుతేజ శర్మ నివాసంతో పాటు పక్కన ఇంట్లో అద్దెకు ఉంటున్న మోపిదేవి వెంకట సత్య శ్రీనివాసు నివాసంలో దొంగతనం జరిగింది. రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి.. హోమం నిర్వహించేందుకు కొజ్జిలిపేట వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళగా తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాడు. అతడు వచ్చేసరికి ఇంటి తాళం పగలకొట్టి బీరువాలో బంగారం, డబ్బులు కొట్టేశారు నిందితులు. ఇక పక్కన ఉన్న మరో ఇంట్లోకి దూరి.. అక్కడ కూడా బంగారం, డబ్బులు దొంగతనం చేశారు. రెండు కేసులను చాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. టెక్నాలజీ సహాయంతో శ్రీనివాసనగర్ కాలనీ, బందరుకు చెందిన మైనర్లు దొంగతనం చేశారని తెలిసి షాక్ అయ్యారు. దొంగతనం చేసిన కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్, చిలకలపూడి పాండురంగను స్కూల్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, చోరి చేసిన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు.
దొంగతనం చేసిన తీరు గురించి ఆరా తీసిన పోలీసులు యుట్యూబ్‌లో చూసి దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. 9వ తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్లు.. వరుసగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం చేయడానికి ఏ ఇళ్లను ఎంచుకోవాలి.? తాళాలు ఎలా కట్ చేయాలి.?బీరువాను ఎలా బ్రేక్ చేయాలి.? పోలీసులకు దొరక్కుండా ఎలా దొంగతనం చేయాలి.? దొంగతనం చేసాకా ఎలా ఎస్కేప్ అవ్వాలో కూడా యూట్యూబ్‌లో నేర్చుకున్నారు. దీనితో వారి ముగ్గురు తెలివితేటలు చూసి షాక్ అయిన పోలీసులు.. టెక్నాలజీ సహాయంతో పట్టేశారు. దొంగతనాలు చేసి వాటితో జల్సాలు చేయడం, బెట్టింగ్‌లకు పాల్పడటం.. వృత్తిగా మార్చుకున్న మైనర్లను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025