ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్బాయికి.. ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదరడమే గగనం అయిపోతుంది. కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో పెళ్లి కుదిరింది. నారీ నారీ నడుమ మురారి.. ఇద్దరమ్మాయిలతో.. అంటూ పెళ్లి కార్డు ప్రింటింగ్ కూడా అయిపోయింది. అయితే.. ఒకే అబ్బాయిని మనువాడటానికి రెడీ అయిన వారిద్దరూ సొంత అక్కా చెల్లెళ్లే..
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అబ్బాయికి.. ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదరడమే గగనం అయిపోతుంది. కానీ శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో పెళ్లి కుదిరింది. నారీ నారీ నడుమ మురారి.. ఇద్దరమ్మాయిలతో.. అంటూ పెళ్లి కార్డు ప్రింటింగ్ కూడా అయిపోయింది. అయితే.. ఒకే అబ్బాయిని మనువాడటానికి రెడీ అయిన వారిద్దరూ సొంత అక్కా చెల్లెళ్లే.. ఇద్దరూ ఒక్కరినే పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడంతో పెద్దలు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.. పెళ్లి కార్డులు కూడా ప్రింటింగ్ చేయడం.. పెళ్లి ఏర్పాట్లు చేయడం అన్నీ చక చక జరిగిపోతున్నాయి.. ఈ క్రమంలోనే.. సీన్ కట్ చేస్తే వధువులిద్దరూ మైనర్లు అని తెలిసింది.. ఇంకేముంది సీన్లోకి అధికారులు ఎంటర్ అవడంతో వధువు, వరుడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లికి చెందిన గంగరాజుకు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ కు చెందిన ఇద్దరు యువతులతో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 10వ తేదీన గోరంట్లలో పెళ్లి. ఒక వరుడికి ఇద్దరు వధువుల పేర్లతో పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయ్యాయి. ఇద్దరమ్మాయిలతో పెళ్లి అనే పెళ్లి పత్రిక తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ వెరైటీ పెండ్లీ పత్రిక వైరల్ అవ్వడంతో ఐసిడిఎస్ అధికారులు దీనిపై దృష్టి పెట్టారు.
ఇద్దరు అమ్మాయిల వయసు కనుక్కోవడంతో.. ఇద్దరూ మైనర్లు అని తెలిసింది. దీంతో అమ్మాయి తరపు బంధువులు.. అబ్బాయి తరపు బంధువులకు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వివాహం చేయటం చట్ట విరుద్దమని ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు. ఇప్పటికే కుటుంబసభ్యులు పెళ్లి కార్డులు ముద్రించారు.. బంధువులను పెళ్లికి ఆహ్వానించారు. గోరంట్లలో రంగ మహల్ కళ్యాణ వేదికలో పెళ్లి ఏర్పాట్లను కూడా పూర్తిచేశారు.
అయితే.. ఇద్దరమ్మాయిలతో పెళ్లి అంటూ వైరల్ అయిన పెళ్లి పత్రికతో.. అధికారులు ఎంటర్ అవ్వడంతో పెళ్లి నిలిచిపోయింది.. ఏది ఏమైనా ఇద్దరమ్మాయిలతో ఒక వరుడికి పెళ్లి.. అనే ఆహ్వాన పత్రిక వైరల్ అవ్వడంతో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాశంగా మారింది
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే