ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మార్పు బెన్ను అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దళితులకు కేటాయించిన 56 ఎకరాల భూమిలో మరొకరి పేరు మీద ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేయడంపై ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో బెన్ను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగింది? ఉన్నతాధికారులు ఏం అన్నారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బాపట్ల కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుంది. గ్రీవెన్స్ వచ్చిన వారితో హాడావుడిగా ఉంది. అయితే కలెక్టరేట్ వరండాలోకి వచ్చిన మార్పు బెన్ను అనే వ్యక్తి ఒక్కసారిగా పురుగు మందు డబ్బా మూత తీసి తాగడం ప్రారంభించాడు. చుట్టుపక్కల ఉన్న వారు ఇది గమనించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. అసలేం జరింగిందంటే..?
బాపట్ల జిల్లా చిన గంజాం మండలం మున్నంవారి పాలెంకు చెందిన 22 మంది దళితులకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం 56 ఎకరాల భూమిని కేటాయించింది. వీరంతా ఆ భూమిని కొద్దీ కాలం పాటు సాగు చేసుకున్నారు. అనంతరం ఆ భూమిని గ్రామానికే చెందిన మన్నె సునీల్ చౌదరికి లీజుకు ఇచ్చారు. లీజుకి ఇచ్చి కూడా ఏడేళ్లు గడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో బెన్ను భూమిలో ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశారు. దీనిపై బెన్ను అధికారులను కలిసి సునీల్ చౌదరి భార్య పేరు మీద ఏవిధంగా ట్రాన్స్ ఫార్మర్లను మంజూరు చేశారని ప్రశ్నించాడు. అదే విధంగా పోలీసులకు కలిసి తమ భూమిలో ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసిన సంగతి చెప్పాడు. అయితే ఈ విషయంలో అధికారులు, పోలీసులు తాము చేసేదేమి లేదని చెప్పారు. దీంతో బాధితుడు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసేందుకు ఈ రోజు వచ్చాడు.
కలెక్టరేట్‌లోకి వస్తూనే పురుగుమందు డబ్బా తీసుకొని వచ్చాడు. కార్యాలయంలోకి వచ్చిన కొద్ది సేపటికే పురుగు మందు సేవించాడు. సకాలంలో చుట్టు పక్కల ఉన్నవారు స్పందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు. బెన్ను సమస్యను ఉన్నతాధికారులు ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Also Read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





