విజయవాడలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన వృద్ధురాలి కేసును పోలీసులు ఛేదించారు. విద్యాధరపురంలో వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు మురికి కాల్వల్లో పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విజయవాడలో ఉలిక్కిపడేలా చేసింది.

విజయవాడలో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన వృద్ధురాలి కేసును పోలీసులు ఛేదించారు. విద్యాధరపురంలో వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి, వేర్వేరు మురికి కాల్వల్లో పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విజయవాడలో ఉలిక్కిపడేలా చేసింది. మొదట భవానీపురం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. అది హత్య కేసుగా పోలీసులు నిర్ధారించారు.
భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యాధరపురంలో వృద్ధురాలు నివాసం ఉంటుంది. తన నివాసానికి సమీపంలో అక్క కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి భర్తతో గొడవ పడ్డ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తన భార్య వదిలి వెళ్లడానికి తన పిన్నినే కారణమని, ఆమెపై పగ పెంచుకున్నాడు నిందితుడు. ఇక, ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కోసం పక్కా ఫ్లాన్ వేసుకున్నాడు. ఇందులో భాగంగానే అక్టోబర్ 1వ తేదీన మాయమాటలు చెప్పి బండిపై ఎక్కించుకుని తన ఇంటికి పిన్నిని తీసుకెవెళ్ళాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న పదునైన ఆయుధలతో వృద్ధురాలిని తన మైనర్ కొడుకుతో కలిసి దాడి చేసి చంపేశాడు.
ఆ వృద్ధురాలి తల, కాళ్లు, చేతులు ముక్కలు ముక్కలుగా నరికి విజయవాడలోని అక్కనిసన్ స్కూల్ సమీపంలోని మురికి నీటి కాల్వలో పడేశారు. అనంతరం మొండాన్ని విజయవాడ బొమ్మసాని నగర్ లో పడేశారు. ఆ తర్వాత విజయవాడ నుంచి నంద్యాలకు పారిపోయాడు. అయితే ఐదురోజులుగా వృద్ధురాలు కనిపించకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించారు.
దీంతో అసలు యవ్వారం బయటపడింది. వృద్ధురాలిని చంపింది అక్క కొడుకేనని తేలింది. మృతురాలి శరీర భాగాలను ఒక్కొక్కటిగా సేకరించారు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లోని డ్రైనేజ్ లో శరీర భాగాలు కనిపించడంతో వృద్ధురాలవని గుర్తించారు పోలీసులు. కానీ, కాళ్లు మాత్రం లభించలేదని సమాచారం. హత్యలో మైనర్ అయిన కుమారుడి సహకారం ఉండటంతో.. ఇద్దరు నిందితులను నంధ్యాలతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!