SGSTV NEWS
Andhra PradeshSpiritual

Tirupati: తిరుపతి శివాలయంలో కళ్లు తెరిచిన శివలింగం.. పరమేశ్వరుడి మహత్యమేనంటూ..



టెంపుల్ సిటీ తిరుపతిలో నిన్న రాత్రి నుంచి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. శివలింగం కళ్ళు తెరిచిందని విస్తృత ప్రచారం జరుగుతుంది. జనం కూడా పెద్ద ఎత్తున చూసేందుకు ఎగబడగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇలా

తిరుపతిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. స్థానిక శివాలయంలోని శివలింగం కళ్లు తెరిచింది. ఈ వార్త తెలిసి స్థానికులంతా పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. కళ్లు తెరిచిన పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. కొందరు ఆ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్స్‌లో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్‌ అవుతోంది. దేవుని మహిమ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. డి ఆర్ మహల్ ఎదురుగా ఉన్న గాంధీ పురంలో రామలింగేశ్వర ఆలయం ఉంది. ప్రతిరోజూ భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. రోజూలాగే గురువారం కూడా భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో రాత్రి 8:30 గంటల సమయంలో శివలింగంపై కళ్ళు ఏర్పడినట్లు గుర్తించారు. ఇంకేముంది ఈ వార్త క్షణాల్లో ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఈ అద్భుత దృశ్యం వీక్షించేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. అర్ధరాత్రి వరకూ భక్తులు ఆలయంలోనే స్వామివారిని చూస్తూ పూజలు చేస్తుడిపోయారు. శివలింగం కళ్ళు తెరిచినట్లు తాము గుర్తించామని భక్తులు చెబుతున్నారు.



ఈ క్రమంలో డీఆర్‌ మహల్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు శివలింగంపై హఠాత్తుగా ఏర్పడిన కళ్ల దృశ్యాలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. శ్రావణమాసం శుభవేళ ఇదంతా పరమేశ్వరుని మహత్యమే అంటున్నారు.

Also read

Related posts

Share this