తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీని చిరుతల భయం ఇప్పట్లో వీడేలా లేదు. యూనివర్సిటీ సిబ్బందిని, విద్యార్థులను చిరుతల సంచారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యూనివర్సిటీ ప్రాంతాన్ని చుట్టేస్తున్న చిరుతలు ఎక్కడపడితే అక్కడ తరచూ కంటపడుతూనే ఉన్నాయి. ఒకవైపు ఆపరేషన్ చిరుత చేపట్టినా ఫారెస్ట్ యంత్రాంగం సక్సెస్ కాకపోగా.. దడ పుట్టిస్తున్న చిరుతల సంచారం మాత్రం కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. చీకటి పడితే చాలు చిరుతల గాండ్రింపుల శబ్దం కలవరపెడుతుండగా.. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వర్సిటీ ప్రాంతానికి చేరుకుంటున్న చిరుతలు.. కుక్కలు, జింకలను చంపుతున్నాయి. దీంతో అలిపిరి సమీపంలోనే ఉన్న ఎస్వీ యూనివర్సిటీలో చిరుతల భయం వెంటాడుతోంది.
గత కొన్ని నెలలుగా ఈ సమస్య ఆందోళన కలిగిస్తుండటం చూస్తే చిరుతలు వర్సిటీ ప్రాంతంలోనే తిష్ట వేసినట్లుగా పరిస్థితి మారిపోయింది. రోజూ విద్యార్థులు, ఉద్యోగుల కంటపడుతున్న చిరుతలు తమ వేటను కొనసాగిస్తున్నాయి. ఈజీగానే ఆహారం, దాహం తీర్చుకునే వసతి ఉన్న యూనివర్సిటీ ప్రాంతాన్ని విడిచి వెళ్ళేది లేదన్నట్లు చిరుతల సంచారం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాంతంలో ఉన్న జింకలు, కుక్కలను ఆహారంగా తీసుకునేందుకు చిరుతల సంచారం యదేక్షగా కొనసాగుతోంది. ఈ మధ్యనే యూనివర్సిటీ లైబ్రరీ వెనుక చెట్టుపై కుక్క కళేబరాన్ని గుర్తించారు విద్యార్థులు. నాలుగు రోజుల క్రితం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ సమీపంలోనే చిరుత గంటకు పైగా తిష్ట వేసింది. ముళ్లపొదల్లో సేద తీరిన చిరుతను గుర్తించిన విద్యార్థులు అతి కష్టం మీద ఫారెస్ట్ సిబ్బందితో కలిసి తరిమికొట్టారు. రాత్రి 8 గంటల సమయంలో చిరుతను గుర్తించిన వర్సిటీ విద్యార్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చి చిరుతను తరిమేందుకు అటవీశాఖ సిబ్బందితో కలిసి విశ్వ ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. దాదాపు గంటకుపైగా అక్కడే ఉన్న చిరుతను ఎట్టకేలకు అక్కడి నుంచి తరిమేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇక నిన్న రాత్రి మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో చిరుత జింకను చంపినట్లు గుర్తించిన వర్సిటీ అధికారులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని చిరుత సంచారాన్ని పరిశీలించిన అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తం చేసింది. ఎస్వీయూలోని సెంట్రల్ లైబ్రరీ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ఇంజనీరింగ్ కాలేజ్ పరిసరాల్లోనే చిరుతలు తరచూ కనిపిస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజుల వ్యవధిలోనే చిరుతలు రెండు జింకలను చంపడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో వర్సిటీని చిరుతల భయం వీడేది ఇంకెప్పుడన్న విద్యార్థుల ప్రశ్నకు మాత్రం సమాధానం రాకపోతోంది
Also read
- ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
- హెల్త్ సూపర్వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
- Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ
- ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో