SGSTV NEWS
Andhra Pradesh

Andhra: ఆరు దాటితే ఆ రోడ్డులో భయం భయం.. అసలు ప్రజలు ఎందుకు భయపడుతున్నారో తెల్సా



అమ్మో.! చీకటి పడితే ఆ రోడ్డున వెళ్లలేరు. వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అనూహ్యంగా అనుకోని అతిధి వస్తుండటంతో దెబ్బకు షాక్ అయ్యారు. ఈ రోడ్డు తిరుపతిలో ఉండగా.. ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

తిరుపతిలో ఇప్పుడు చిరుతల భయం ఎక్కువయింది. అలిపిరి వద్ద తరచూ కనిపిస్తున్న చిరుతలు భక్తులను, వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు అలిపిరి నుంచి జూపార్క్ వెళ్లే రోడ్డును దాటుతూ కనిపిస్తున్నాయి. జూ పార్క్ రోడ్డులో ఆసుపత్రులు, రోడ్డుపై ఉన్న ఫుడ్ స్టాల్స్ వద్ద సంచరించే కుక్కల కోసం వస్తున్న చిరుతలు ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అక్కడ జింకలు కూడా ఉంటుండడంతో ఆహారం కోసం వస్తున్న చిరుతలు యూనివర్సిటీలో ఉన్న నీటి కుంటల వద్దకు చిరుతలు అలవాటుగా వస్తున్నాయి.

ఇలా తిరుమల కొండల్లోని అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు జూ పార్క్ రోడ్డులో మాటువేసి రోడ్డు దాటే సమయంలో వాహనాలకు అడ్డుగా వస్తున్నాయి. ఈ మధ్యనే బైక్‌పై వెళుతున్న వ్యక్తికి చిరుత రోడ్డు దాటే సమయంలో అడ్డుగా రావడంతో ప్రమాదం కూడా జరిగింది. బైక్ నుంచి పడిపోయిన వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. నిన్న రాత్రి జూ పార్క్ వైపు నుంచి అలిపిరి వైపు బైక్‌పై వస్తున్నవారికి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.

అయితే బైక్‌పై వేగంగా వెళుతున్నవారి వెనుక వైపు చిరుత తాకగా.. బైకు వెనకే కారులో వస్తున్నవారి మొబైల్‌కి చిరుత ఎటాక్ చేసిన విజువల్స్ దొరికాయి. వెనుకే కారు వేగంగా వస్తుండడంతో చిరుత తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. బైక్ వేగంగా వెళ్లిపోవడం.. చిరుత చాకచక్యంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగకపోగా.. 5 రోజుల క్రితం కూడా జూపార్క్ రోడ్డులో నిర్మించిన కల్వర్టు గోడపై చిరుత కూర్చుని వాహనదారులను భయపెట్టింది

Also read

Related posts

Share this