SGSTV NEWS
Andhra PradeshCrime

ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న మృత్యువు..! అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా మరో ప్రమాదం..



వెంట వెంటనే ప్రమాదాలు.. ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు బంధువులు.. కుటుంబసభ్యులు చనిపోతే.. అంత్యక్రియలు వెళ్లి వస్తున్న అదే కుటుంబానికి చెందిన వారు మరోసారి రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.. కర్నూలు నుంచి విజయవాడకు వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి..


కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన రమేష్ కుటుంబ సభ్యులను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రమేష్ కుటుంబానికి సమీప బంధువులు రమేష్ కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా.. నెల్లూరు జిల్లా జలదంకి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీంతో రమేష్ కుటుంబంలో నలుగురు మృతి చెంది నాలుగు రోజులైనా గడవక ముందే.. వారి అంత్యక్రియలకు వచ్చిన మరో కుటుంబం ఐసీయూ చికిత్స పొందుతుండడం ఆ కుటంబాన్ని భయాందోళనలకి గురిచేస్తుంది..

ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ఘటన తెలిసిందే.. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోగా ఈ ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన రమేష్ కుటుంబం కూడా సజీవ దహనమైంది. రమేష్‌తో పాటుగా అతని భార్య, కొడుకు, కూతురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రోజున వీరి అంత్యక్రియలను నిర్వహించారు. అయితే, అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి విజయవాడకు వెళ్తున్న రమేష్ బంధువులు కావలి సమీపంలోని జలదంకి వద్ద కారు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరగ్గా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

వింజమూరు మండలం గోళ్లవారిపల్లెలో రమేష్, అతని భార్యాపిల్లల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తైన అనంతరం వారి బంధువులు కారులో విజయవాడకు తిరిగి వెళ్తుండగా.. జలదంకి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు.. ప్రమాదానికి గురైంది. టైరు పంక్చర్ కావటంతో అదుపు తప్పింది. ఈ క్రమంలోనే కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ కుటుంబంలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో.. అంతా ఆందోళన చెందుతున్నారు

Also read

Related posts