SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: అనుమానం పెనుభూతం.. భార్యను రోకలిబండతో కట్టి చంపిన భర్త.. ఆ తర్వాత..




నంద్యాల జిల్లాలో శివకృష్ణ, కవిత దంపతులు కుండలు తయారీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే పచ్చని సంసారంలో అనుమానం ప్రాణాలు తీసేలా చేసింది. భార్యను భర్త రోకలి బండతో కొట్టి చంపేశాడు. దీంతో ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారు.


అనుమానం పెనుభూతమైంది. అనుమానంతో భార్యపై దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మరణించింది. భర్త పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. నంద్యాల జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త రోకలి బండతో కొట్టిన చంపడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. భార్యపై అనుమానంతో భర్త ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా అబండతండాకు చెందిన శివకృష్ట, కవితకు 15ఏళ్ల క్రితం వివాహం అయింది. వీళ్ళు గ్రామంలో కుండలు తయారు చేసి నంద్యాల పట్టణంలో అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళకు ముగ్గురు సంతానం. అయితే భర్త శివకృష్ణ భార్య కవితపై అనుమానంతో రోజు హింసించేవాడు.


ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం శివ కృష్ణ, కవిత మద్య గొడవ జరిగింది. కవితకు వేరే వ్యక్తితో ఆక్రమ సంబంధ ఉందంటూ శివకృష్ణ దాడి చేశాడు. ఈ క్రమంలో కవితను రోకలిబండతో కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బయట చుట్టుప్రక్కల వారిని గమనించిన శివకృష్ణ భయపడి.. నేరుగా నంద్యాల అర్బన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భార్య మృతి, భర్త జైలుకెళ్లడంతో ముగ్గరు పిల్లలు రోడ్డున పడ్డారు


Also read

Related posts

Share this