గుంటూరు నగరంలోని సీతమ్మకాలనీకి చెందిన రామాంజినేయులు ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6 వ తేదిన ఇంటి నుండి వెళ్లిపోయిన రామాంజినేయులు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య శివ పార్వతికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామాంజినేయులు అదృశ్యంపై మొదట పోలీసులు మిస్సింగ్ నమోదు చేశారు. అయితే ఆ తర్వాత శివ పార్వతి అదే కాలనీకి చెందిన కొండయ్యపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు చెప్పింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన నగరంపాలెం పోలీసులు కొండయ్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలిలో విచారించారు. అయినా ఎటువంటి సమాచారం లభ్యం కాలేదు. పది రోజుల గడిచినా రామాంజినేయులు ఏమయ్యాడో తెలియకపోవడంతో బంధువుల్లో అలజడి పెరిగిపోయింది. కాలనీల్లో అందరూ రామాంజినేయులను కొండయ్య హత్య చేశాడని చెప్పుకుంటున్నారు. పోలీసులు మాత్రం మృతదేహం ఎక్కడుందో కనుగొనలేకపోయారు. దీంతో అసలు రామాంజినేయులు ఉన్నాడా లేడా..? అన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. శివపార్వతి ఆమె బంధువులు మాత్రం నగరంపాలెం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా రామాంజినేయులు అదృశ్యంపై ఎటువంటి సమాచారం మాత్రం అందుబాటులోకి రాలేదు.
దీంతో నిన్న శివపార్వతి ఆమె బంధువలు నగరంలోని కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దాదాపు పది రోజుల క్రితమే తన భర్త అద్రుశ్యం అయ్యాడని ఇప్పటి వరకూ ఎక్కుడున్నాడో కూడా తెలియడం లేదని, నగరంపాలెం పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గుంటూరు వెస్ట్ డిఎస్పీ అరవిండ్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి రామాంజినేయులు ఏమయ్యాడో సాయంత్రానికి స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దీ సేపటికే కొండయ్య రామాంజినేయులను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
అయితే మృతదేహం ఎక్కడుందో చెప్పాలని పోలీసులు కొండయ్యపై ఒత్తిడి తెచ్చారు. దీంతో కొండయ్య నగరంపాలెం పోలీసులను అద్దంకి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడొక చెరువులో రామాంజినేయులు మృతదేహాన్ని పడేసినట్లు చెప్పాడు. అక్కడ గాలింపు చేపట్టిన పోలీసులకు మృతదేహం లభ్యమైంది. అ తర్వాత విచారణలో అసలు విషయాలు వెలుగు చూశాయి.
రామాంజినేయులకు.. కొండయ్య భార్యతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపధ్యంలోనే రామాంజినేయులను హత్య చేయాలని ప్లాన్ వేసుకున్నాడు కొండయ్య.. ఈ నెల ఆరో తేదిన రామాంజినేయులను ఊరు బయటకు తీసుకెళ్లి మద్యం తాగించి ఆ తర్వాత హత్య చేశాడు. అనంతరం కారులో మృతదేహాన్ని అద్దంకి వద్దకు తీసుకెళ్లి అక్కడ చెరువలో పడేసి వచ్చాడు. అయితే కొండయ్యకు ఈ హత్యలో ఎవరెవరూ సహకరించారో పోలీసులు కూపీ లాగుతున్నారు. కొండయ్యతో పాటు మిగిలిని అందరిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు