ఇద్దరు పాత నేరస్తులు.. జైల్లో దోస్తీ కట్టారు.. ఇటీవల విడుదలయ్యారు.. టూరిజం ట్రిప్ పేరుతో కారు అద్దెకు తీసుకున్నారు.. టూరిస్టుల్లా కడప నుంచి ఏజెన్సీలో వాలిపోయారు.. స్థానికులతో కలిసి ఒడిస్సా వెళ్లారు.. అక్కడ నుంచి రిటర్న్ అయ్యారు.. ఏజెన్సీ బోర్డర్లో పోలీసులు చెక్ చేస్తుండగా.. నీళ్లు నమిలారు. ఏమిటా అని ఆరాతీస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారు. పోలీసులకు ఎక్కడో డౌట్..! వాహనం అంతా చెక్ చేశారు.. కానీ ఎక్కడ ఏమీ లభించలేదు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మకు వాళ్ల కదలికలపై అనుమానం.. దీంతో కారు లోపల కాదు.. అనుమానాలు ఉన్నచోట తనిఖీలు చేయడం ప్రారంభించారు. కారు డోర్ లోపల వైపు ఏదో ఉన్నట్టు అనిపించింది. డోర్ ఓపెన్ చేసే హ్యాండిల్ ను చెక్ చేస్తే.. అసలు గుట్టు బయటపడింది.. వార్నీ పుష్ప సీన్ కు ఏమాత్రం తగ్గకుండా.. ‘తగ్గేదేలే’ అన్నట్టుగా ఉంది వాళ్ళ యవ్వరం..
వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా కోరుమిల్ల మండలం గిరి నగర్కు చెందిన గురయ్య పాత నేరస్థుడు. అతనిపై బద్వేల్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. అదే జిల్లాకు చెందిన నాగడసారి కేశవ, అక్కి దాసరి శ్రీహరి.. జత కలిశారు. వారిలో గురయ్య, చంటిబాబు ఇద్దరూ ఇటీవల జైలుకి వెళ్లారు. కడప జిల్లా బద్వేల్ జైల్లో ఉండగా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఇటీవలే ఇద్దరు జైలు నుంచి విడుదలయ్యారు. మళ్లీ షరా మామూలే..! చంటి బాబుకు స్నేహితులైన కేశవ, దాసరి శ్రీహరితో మాట్లాడారు. ఈ లోక దాసరి శ్రీహరి టూరిజం ట్రిప్ పేరుతో కారు అద్దెకు తీసుకున్నాడు. ఎంచక్కా ఏజెన్సీలో వాలిపోయారు. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుకు వెళ్లారు. అక్కడ లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేశారు. నలుగురు కలిసి తిరుగు ప్రయాణమయ్యారు.
అలా చిక్కారు..
ఏఓబీలో సరుకు తీసుకొని.. ఏజెన్సీ ముందుగా మైదానానికి ప్రయాణమయ్యారు. దాదాపుగా ఏజెన్సీ పూర్తిగా సక్సెస్ఫుల్గా దాటేశారు. ఈలోగా.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివారు కేడీపేట వద్ద పోలీసులు వాహన తనిఖీలు మొదలుపెట్టారు. సిఐ రేవతమ్మ నేతృత్వంలో గొలుగొండ కేడీపేట ఎస్సైలు రామారావు, తారకేశ్వరరావు వాహనాలపై నిఘా పెట్టారు. ఈలోగా చంటిబాబు అండ్ టీం ప్రయాణిస్తున్న కారు అటువైపుగా వచ్చింది. వారిని ఆపి ప్రశ్నించారు పోలీసులు. చంటిబాబు అయితే లోకల్ బాయ్ గా కనిపించాడు.. కానీ మిగతా వారిపై పోలీసులకు అనుమానం. అది కూడా.. స్థానికులు ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు ఇద్దరు కలిసి రావడం పై మరింత అనుమానం పెరిగింది. వాళ్లను ప్రశ్నించారు పోలీసులు.. ఎంతైనా పాత నేరస్తులు కదా చాకచక్యంగా మాట్లాడారు. చూసేందుకు వచ్చిన స్నేహితులను చూపిస్తున్నామని చంటిబాబు చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ పోలీసులకు ఏదో అనుమానం.. వెరిఫై చేస్తే ఎక్కడా ఏమి లేదు. అయినప్పటికీ ఏదో అనుమానం..
కారు డోర్ హ్యాండిల్ చెక్ చేస్తే..
కారంతా వెతికారు పోలీసులు… ఎక్కడ ఏమీ లభించలేదు. కానీ.. గంజాయి పండుగ ఎత్తులకు పైఎత్తులను దీటుగా తిప్పి కొడుతున్న పోలీసులు.. ఆ స్టైల్లో వెరిఫై చేశారు. దీంతో కారు బయట లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సీట్.. డోర్ పై అనుమానం కలిగి చూశారు. ఏదో తేడాగా ఉందని అనిపించింది. మెల్లగా కారు హ్యాండిల్ విప్పి.. ఓపెన్ చేసేసరికి.. అప్పుడు ఆ గంజాయి గుట్టు బయటపడింది. కిలో ద్రవ రూపంలో ఉన్న లిక్విడ్ గంజాయి ప్యాకెట్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి స్మగ్లర్ల యవ్వారం చూసి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. రవాణాకు వినియోగించిన టయోటా కారును పోలీసులు సీజ్ చేశారు. మరో ప్రధాన నిందితుడని అరెస్టు చేస్తామని అంటున్నారు నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాసరావు. చాకచక్యంగా లిక్విడ్ గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్న సిఐ రేవతమ్మతోపాటు పోలీసులను అభినందించారు.
Also read
- స్మశానంలోకి ఆ రాత్రి తీసుకెళ్లి మరీ.. అలా చేశాడు.. రైడర్లూ పారా హుషార్..!
- Weekly Horoscope: ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టే ఛాన్స్..12 రాశుల వారికి వారఫలాలు
- తాడేపల్లిగూడెంలో ఇండియన్ ఆయిల్ సిబ్బంది దౌర్జన్యం
- సొంత అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు…
- మార్కండేయ మహాదేవ్: ఇక్కడ శివయ్యకు బిల్వ పత్రంతో పూజ చేస్తే సంతానం కలుగుతుందట,