April 3, 2025
SGSTV NEWS
Andhra Pradesh

AP News: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా

అప్పుడప్పుడూ కొందరికి దేవుడు కలలోకి వస్తాడని మనం వినే ఉంటాం. అమ్మవారి విగ్రహాలు, శివలింగాలు, దేవుడి విగ్రహాలు కలలో కనిపిస్తుంటాయి. అక్కడ తవ్వమన్నాడు.. ఇక్కడ తవ్వమన్నాడు అని చెప్పి.. తనకు బయటకు తియ్యమన్నాడని చెబుతుంటారు. సరే.! అని వాళ్ల మాటలు నమ్మి తవ్వితే.. అక్కడ కచ్చితంగా ప్రత్యక్షమైన సందర్భాలు లేకపోలేదు. ఈ తరహ ఘటన ఒకటి అనంతపురంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే అంజి అనే వ్యక్తికి కలలో కనిపించిన అమ్మవారు. తాను చెప్పిన చోట తవ్వమన్నది. తీరా తవ్వి చూడగా కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు.




వివరాల్లోకి వెళ్తే.. అనంతపురంలోని గౌరవ గార్డెన్ వాటర్ ట్యాంక్ సమీపంలో తవ్వకాలు జరపగా.. గంగమ్మ అమ్మవారి విగ్రహం ఒకటి బయటపడింది. స్థానికంగా నివసిస్తున్న అంజి అనే వ్యక్తి కలలోకి వారం రోజులుగా అమ్మవారు కలలోకి వచ్చి.. తాను ఇక్కడ ఈ ప్రదేశంలో రెండు అడుగుల లోతులో ఉన్నానని.. తన విగ్రహాన్ని బయటకు తీయాలని చెప్పిందట. ఈ విషయాన్ని అంజి మొదటిగా స్థానికులకు చెప్పాడు. అయితే అతడి మాటలను పెద్ద నమ్మలేదు. అయితే అంజి ప్రతీ రోజూ ఇదే మాట చెబుతూ వస్తుండటంతో.. నిజంగానే అమ్మవారు కలలో కనిపించినట్టుందని నమ్మారు స్థానికులు. ఇక అమ్మవారు చెప్పినట్టుగానే యువకుడితో పాటు స్థానికులు కూడా ఆమె చెప్పిన చోటుకు వెళ్లి తవ్వగా.. రెండు అడుగుల లోతులో గంగమ్మ అమ్మవారి విగ్రహం ప్రత్యక్షమైంది. గంగమ్మ అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీయగానే.. పూనకం వచ్చిందంటూ ఊగిపోయాడు అంజి. ఇక విగ్రహం బయటపడటం.. అంజి చెప్పింది నిజమేనని నమ్ముతున్నారు స్థానికులు. బయటకు తీసి ఆ విగ్రహాన్ని మంచిగా కడిగి.. దానికి పసుపు, కుంకుమ, పూలు, నిమ్మకాయలు పెట్టి పూజలు చేస్తున్నారు.

Also read

Related posts

Share via