SGSTV NEWS
Andhra PradeshCrime

Annavaram: ఆలయంలో పెళ్లి.. పీటలపై ఏడుస్తూ కనిపించిన వధువు.. ఏంటా అని ఆరా తీయగా



కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో జరుగుతున్న ఓ పెళ్లిలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. పెళ్లి పీటలపై వధువు ఏడుస్తుండటంతో అనుమానం వచ్చిన భక్తులు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భక్తులు ఆలయ నిర్వాహకులు, పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో పెళ్లి ఆగిపోయింది.

కొందరు గ్రాండ్‌గా పంక్షన్ హాళ్లలో పెళ్లి చేసుకుంటారు. మరొకొందరు తమ ఇళ్ల వద్దే వివాహ వేడకలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంకొందరు.. తమ పొలాల్లో, జాగాల్లో పెళ్లి వేడకను నిర్వహిస్తూ ఉంటారు. అతికొద్దిమంది మాత్రం ఆలయాల్లో పెళ్లి జరిపిస్తూ ఉంటారు. దేవుడి ఆశీస్సులు ఉంటాయని ఇలా చేస్తూ ఉంటారు. అలా అన్నవరం ఆలయంలో శనివారం ఉదయం సమయంలో ఓ పెళ్లి జరుగుతుంది. అయితే పీటలపై ఉన్న వధువు ఏడుస్తూ కనిపించింది. దీంతో కొందరు భక్తులు ఏమైందమ్మా అని అడిగారు. తనకంటే 20 ఏళ్ల పెద్ద వ్యక్తితో  ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటే తను బావురుమంది.  వారి ద్వారా విషయం తెలియడంతో ఆలయ సిబ్బంది ఈ పెళ్లి తతంగాన్ని ఆపేశారు. ఆ తర్వాత పోలీసులు సమాచారం ఇవ్వడంతో.. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది.

తనకు 42 ఏళ్ల వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారని ఆ యువతి పోలీసులకు చెప్పింది.. తనకు ఈ వివాహం ఏ మాత్రం ఇష్టం లేదని వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఇరు కుటుంబాల వాళ్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. ఇష్టం లేని వివాహం చేస్తే.. రెండు జీవితాలు బలి అయినట్లే. ఆ కాపురం సవ్యంగా సాగుతుందని ఎట్టి పరిస్థితుల్లో ఊహించలేం. లేనిపోని క్రైమ్స్‌కు కూడా ఈ తరహా పెళ్లిళ్లు దారి తీయొచ్చు.

Also read

Related posts