హైదరాబాద్‌లో ఓ రెపిడో రైడర్‌ను ఓ టీనేజర్ దోచుకున్న ఘటన చోటుచేసుకుంది. పని ముగించుకుని వెళుతున్న రైడర్‌కు లిఫ్ట్ ఇవ్వమని అడిగిన ఆ బాలుడు, తర్వాత స్మశానం వద్ద ఆపి, దాడి చేసి ₹41,800లు దోచుకున్నాడు. పోలీసులు త్వరగానే నిందితుడిని అరెస్ట్ చేశారు. రాత్రి పూట పనిచేసే డెలివరీ బాయ్‌లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
డెలివరీ బాయ్ లు.. ట్రాన్స్పోర్ట్ రైడర్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగాలు లేక.. ఫుల్ టైం, పార్ట్ టైం గా పొట్టకూటి కోసం కష్టపడుతూ ఉంటారు. కొందరైతే.. పగలంతా ఒక చోట, ఆ తర్వాత మరోచోట ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటారు. అలాగే ఫార్మా కంపెనీలో పనిచేసే ఓ యువకుడు.. పార్ట్ టైం రేపడా రైడర్గా పనిచేస్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో.. ఓ బాలుడు బైక్ను ఆపాడు. తనకు లిఫ్ట్ ఇవ్వాలని కోరాడు. స్టీల్ ప్లాంట్ లోపలికి రైడ్ మాట్లాడుకున్నాడు. సరే అని అతన్ని ఎక్కించుకొని రైడ్ చేస్తూ వెళ్తున్నాడు ఆ యువకుడు. ఇంతలో స్మశానం వద్ద బండి ఆపమన్నాడు ఆ బాలుడు. స్మశానం వైపు ఆ రైడర్ ని లాక్కొని వెళ్లి మరీ దాడి చేశాడు…
వివరాల్లోకి వెళితే.. పార్ట్ టైం రెబడో రైడర్ గా పనిచేస్తున్న కిషోర్… ఫార్మా కంపెనీలో పని చేస్తూ ఉన్నాడు. ఈనెల 10వ తేదీన.. ర్యాపిడో రైడ్ కు వెళ్ళాడు. ఆరోజు రాత్రి పని ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు కిషోర్. సమయంలో శ్రీనగర్ పెట్రోల్ బంకు వద్ద.. ఓ బాలుడు బైక్ను ఆపాడు. రేపటి రైడర్ కావడంతో స్టీల్ ప్లాంట్ లోపలికి రైడ్ మాట్లాడుకున్నాడు. తాను పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నాను అని చెప్పినప్పటికీ.. తనకు అర్జెంటుగా వెళ్లాలి హెల్ప్ చేయాలని కోరాడు ఆ బాలుడు. దీంతో ఆ బాలుడిని ఎక్కించుకొని బయలుదేరాడు రాపిడో రైడర్ కిషోర్.
వెళ్తూ ఉండగా ఒక్కసారిగా బైక్ ఆపమన్నాడు ఆ బాలుడు. రోడ్డు అంతా చీకటి.. పక్కనే స్మశానం. బైక్ లాక్ లాక్కున్నాడు ఆ బాలుడు. స్మశానం వైపు రైడర్ను లాక్ వెళ్తున్నాడు. ప్రతిఘటించేసరికి రైడర్ పై దాడి చేశాడు. ఎందుకలా చేస్తున్నావ్ అని ప్రశ్నించేసరికి మరో దెబ్బ వేశాడు. పిడుగులు బుద్ధి తన దగ్గర ఉన్న ఫోను లాక్కున్నాడు. ఫోన్ పే లాక్ ను తెలుసుకొని.. దప దఫాలుగా ఆ అకౌంట్లో ఉన్న 41 వేల 800 రూపాయలను తన స్నేహితుడి ఖాతాకు పంపించాడు ఆ బాలుడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు.
పక్కనే పోలీస్ స్టేషన్..
బాలుడు చేతిలో దాడికి గురైన రేపడో రైడర్ కిశోర్.. వెంటనే కూతవేటు దూరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ ఘటనను వివరించాడు. దీంతో క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.. దర్యాప్తు ప్రారంభించి గంటల వ్యవధిలోనే పెదగంట్యాడ సమతా నగర్ సాయిబాబా గుడి వద్ద ఉన్న ఆ బాలుడిని పట్టుకున్నారు. విచారించి నగదు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు అలవాటు పడి నేరాలు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు.
పోలీసుల విజ్ఞప్తి
రాత్రి పూట విదులు నిర్వర్తించే ఫుడ్ డెలివరీ బాయ్స్, స్విగ్గి బాయ్స్, రాపిడో సర్వీస్ వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. రాత్రి సమయములో విదులు ముగించు కొని ఇంటికి వెళుతున్న వారు రాత్రి సమయము లో అపరిచిత వ్యక్తులను నమ్మి లిఫ్ట్ ఇవ్వొద్దని అంటున్నారు. ప్రైవేటు సర్వీస్ చేస్తున్నవారు APP లో రైడ్ బుక్ చేసుకున్న వారిని మాత్రమే తీసుకు వెళ్ళాలని, అపరిచితులు ఎక్కువ డబ్బులు ఇస్తాను అంటే నమ్మి APP లో రైడ్ బుక్ చేసుకోకుండా తీసుకొని వెళ్లక పోవడమే మంచిదని సూచిస్తున్నారు క్రైమ్ డిసిపి లతా మాధురి
Also read
- Chevella: ముక్కుపచ్చలారని పసి తల్లులు.. ఎట్టా తీసుకెళ్లాలనిపించింది దేవుడా..?
- Vizag: ఏ రాక్షసుడు పూనాడురా నీకు.. 24 గంటల్లో డెలివరీ కావాల్సి ఉండగా భార్య హత్య
- ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. మూడంతస్తుల భవనానికి వేలాడుతూ కనిపించిన డెడ్ బాడీ! తీరా చూస్తే..
- అప్పటివరకు ఆమెతో బాగానే ఉన్నాడు.. మరొకరు పరిచయమయ్యాక.. ప్రైవేట్ వీడియోలతో..
- పెళ్లయిన మూడురోజులకే రౌడీషీటర్ దారుణ హత్య..