SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: దుర్మార్గుల్లారా.. ఎంతకు తెగించార్రా.. వీళ్లను ఏం చేయాలో మీరే చెప్పండి..



ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరవనంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.. నగరవనంలో ఒంటరిగా ఉన్న ప్రేమజంటను.. అటవీశాఖ సిబ్బంది పేరుతో బెదిరించి పోకిరీలు దారుణానికి పాల్పడ్డారు.. ప్రేమికుడిని నిర్బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు..

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరవనంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.. నగరవనంలో ఒంటరిగా ఉన్న ప్రేమజంటను.. అటవీశాఖ సిబ్బంది పేరుతో బెదిరించి పోకిరీలు దారుణానికి పాల్పడ్డారు.. ప్రేమికుడిని నిర్బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.. అంతటితో ఆగకుండా… అత్యాచారం దృశ్యాలను నిందితులు మొబైల్‌లో రికార్డ్‌ చేసినట్లు పేర్కొంటున్నారు. ఈ దారుణ ఘటన సెప్టెంబర్ 25న మురకంబట్టులోని నగరవనంలో చోటుచేసుకుంది. నిందితులను మహేష్, హే మచంద్ర, కిషోర్‌గా గుర్తించిన పోలీసులు. ముగ్గురిపై పోక్సో, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.. అనంతరం నిందితుల కోసం రెండు బృందాలతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టి.. నిందితులను పట్టుకున్నారు. సీసీ ఫుటేజ్‌లో లైంగిక దాడి నిందితుల గుర్తించి.. నీవా నగరవనం వాసులు వారిపై దాడి చేశారు. దాడి అనంతరం నిందితుల్ని పోలీసులకు అప్పగించారు. లైంగిక దాడిపై బాలిక ఫ్రెండ్ గ్రామస్తులకు సమాచారమిచ్చింది.. దీంతో 2 రోజులు కాపుగాచి నిందితుల్ని పట్టుకున్న గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నగరవనం ప్రాంతానికి వెళ్లిన ఒక ప్రేమజంట ముగ్గురు పోకిరిల కంట పడింది. ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన యువకులు దారుణానికి ఒడి కట్టారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తుల మంటూ ప్రేమ జంటను బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు యువకులు. ప్రేమికుడిని నిర్బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెల్చారు. చిత్తూరు జిల్లా ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్ లో బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి వివరాలు సేకరించిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన యువకులు ముగ్గురు మొబైల్ లో కూడా చిత్రీకరించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మురకంబట్టుకు చెందిన మహేష్, హేమచంద్ర, కిషోర్ లుగా గుర్తించి ముగ్గురిపై ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు . బాధిత బాలికకు చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుల కోసం రెండు పోలీసు బృందాలు గాలించాయి..

అయితే.. ఈ ఘటన అనంతరం నిందితులు టిడిపి – వైసిపికి చెందినవారుగా సోషల్ మీడియాలో రెండు పార్టీల కేడర్ విస్తృత ప్రచారం చేయడం కలకలం రేపింది. ఆయా పార్టీల నేతలు కండువాలు వేసుకున్న నిందితుల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి కామెంట్లు చేసుకోవడం సంచలనంగా మారింది.. దీంతో సున్నితమైన అంశాన్ని రాజకీయ పార్టీలు ప్రచారం కోసం వాడోద్దని పోలీసుల వార్నింగ్ ఇచ్చారు

Also read

Related posts