SGSTV NEWS
Andhra PradeshCrime

ఆడుకుంటున్న చిన్నారిపై కుక్కల గుంపు దాడి! కన్నీళ్లు పెట్టించే ఘటన

 



కుక్కల వల్ల పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని, వ్యాక్సినేషన్, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


వీధి కుక్కలకు పసిపిల్లలు బలవుతున్నారు. కుక్కలకు వ్యాక్సిన్ వేయకపోవడం, ఆసుపత్రులలో సరైన చికిత్స అందుబాటులో లేకపోవడంతో కుక్కల దాడిలో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప ఎస్సీ కాలనీలో కుక్కల దాడిలో కిందపడి చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన జయరాముడు, రామేశ్వరి దంపతుల కూతురు మధుప్రియ (4 సంవత్సరాల) పై వీధి కుక్కలు గుంపు దాడి చేశాయి. వెంటనే గమనించిన స్థానికులు కుక్కలను తరిమి పాపను రక్షించారు. అప్పటికే సృహ కోల్పోయిన పాపను బనగానపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. బాధితురాలి బంధువులు మీడియాతో మాట్లాడుతూ… గ్రామంలోని ఎస్సీ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం వల్ల భయాందోళనకు గురవుతున్నామన్నారు. నంద్యాల, బనగానపల్లె వైపు వెళ్లే ద్విచక్ర వాహనాలపై కుక్కలు దాడికి చేస్తున్నాయన్నారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని, బాధిత కుటుంబం మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా అధికారులు చూడాలని వేడుకుంటున్నారు. అదేవిధంగా ప్రధాన రహదారిపై ఉన్న స్కూల్ ఎదుట స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నామని రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేయించాలని అధికారులను గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Also read

Related posts

Share this