SGSTV NEWS online
Andhra PradeshCrime

Vizianagaram: పెళ్లి రోజు వధువు ఇచ్చిన ట్విస్ట్‌కు బిత్తరపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు



విజయనగరం జిల్లాలో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి ముహూర్తం నిశ్చయించిన రోజే వధువు తన ప్రియుడితో కలిసి పరారైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ప్రేమజంట కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.


విజయనగరం జిల్లాలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. పెళ్లి ముహూర్తం నిశ్చయించిన రోజే వధువు తన ప్రియుడితో కలిసి పరారైంది. నగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన ఓ యువతి, గత కొంతకాలంగా నగరంలో ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తుంది. ఈ క్రమంలోనే అక్కడే పనిచేస్తున్న ఓ యువకుడిని ప్రేమించింది. వారి ప్రేమ కాస్త మరింత ముదిరి తరచూ కలుసుకోవడం మొదలైంది. ఇది తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, ఆమెకు మేనమామతో పెళ్లి నిశ్చయించారు. జూన్ 5వ తేదీన విశాఖపట్నం సింహాచలంలో వివాహం జరగాల్సింది. కానీ పెళ్లికి ఐదు రోజుల ముందు ప్రియుడు యువతి ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. ఈ విషయం పై యువతి కుటుంబ సభ్యులు అతని పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.

అయితే అనూహ్యంగా ప్రణాళికాబద్ధంగా స్కెచ్ వేసుకొని పెళ్లి రోజే యువతి తన ప్రియుడితో కలిసి పరారైంది. ఇద్దరూ మేజర్లు కావడంతో చేసేదిలేక యువతి తల్లి పోలీసులకు పిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ప్రస్తుతం ప్రేమజంట కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది

Also read

Related posts