ప్రాణంగా ప్రేమించానని నమ్మించి.. ఓ అమాయకురాలి నిండు ప్రాణాలు తీశాడో మృగాడు. ప్రియురాలు వ్యభిచారం చేయడానికి అంగీకరించలేదని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు.. ఆనక పారిపోయాడు. అడ్డు వచ్చిన వారిపై కూడా విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది..
రాజోలు, జులై 17: వారిద్దరి కులాలు, మతాలు వేరు వేరు. అయినా పెద్దలను కాదని ప్రేమించుకున్నారు. అనక ఓ అద్దె ఇల్లు చూసుకుని కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇద్దరి మధ్యా మనస్పర్ధలు రాసాగాయి. ఈ క్రమంలో ప్రియుడి నీచ బుద్ధి బయటపడింది. వ్యభిచారం చేసేందుకు ప్రియురాలిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బి.సావరం సిద్ధార్థ నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజోలు మండలం బి.సావరం సిద్ధార్థ నగర్‌కు చెందిన షేక్ షమ్మ (22) అనే యువకుడితో ఓలేటి పుష్ప(22) పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. గత కొంతకాలంగా బీ .సావరం గ్రామంలో ఇల్లు అద్దెకి తీసుకొని సహజీవనం సాగిస్తున్నారు. అయితే కొంత కాలం సవ్యంగానే ఉన్నప్పటికీ.. క్రమంలో మనస్పర్ధలు రాసాగాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రియురాలు పుష్పను షేక్ షమ్మ వ్యభిచారం చేయడానికి నా వెంట రావలని కోరాడు. ఇందుకు పుష్ప నిరాకరించింది.
దీంతో కోపోధ్రిక్తుడైన షేక్ సమ్మ.. పుష్పను దారుణంగా చాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో అడ్డు వచ్చిన పుష్ప తల్లి గంగను, సోదరుడునీ కూడా షేక్ షమ్మ గాయపరిచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై కేసు నమోదు చేసి నిందితుడు షేక్ షమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





