April 3, 2025
SGSTV NEWS
Andhra Pradesh

రాత్రి పూట ముళ్ల పొదల్లో నుంచి వింత శబ్ధాలు! ఏంటా అని చూస్తే..

 

కడప, శ్రీసత్యసాయి జిల్లాలలోని గ్రామాల్లో ఎలుగుబంట్ల సంచారం భయాన్ని నింపుతోంది. కొండూరు గ్రామంలో ఒక పెద్ద ఎలుగుబంటి రాత్రుళ్ళు గ్రామంలోకి వస్తుండగా, జీర్గేపల్లి గ్రామం లో మూడు ఎలుగుబంట్లు ఆలయంలో కనిపించాయి. గ్రామస్తులు భయపడుతున్నారు, అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



చీకటి పడితే చాలు ఆ ప్రాంతంలోని ముళ్ల పొదల్లోంచి వింత వితం శబ్ధాలు వస్తున్నాయి. ఆ శబ్ధాలు వింటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అసలు ముళ్ల పొదల్లో ఏం ఉందా అని ధైర్యం చేసి చూస్తే.. ఆ గ్రామస్థుల గుండె ఆగినంత పనైంది. ఆ పొదల చాటున ఓ భారీ ఎలుగుబంటి సంచరిస్తోంది. కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామంలో ఎలుగుబండి సంచారం కలకలం రేపుతోంది. ఎలుగుబంటి సంచరిస్తోందనే వార్తతో గ్రామస్తులంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ సమయంలో ఆ ఎలుగుబంటి తమపై దాడి చేస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని భయంతో వణికిపోతున్నారు. గత నాలుగు రోజులుగా నల్లకుంట చెరువులోని కంప చెట్ల నుంచి రాత్రి వేళలో గ్రామ వీధుల్లోకి ఎలుగుబంటి వస్తున్నట్లు సమాచారం.

Bear
కొండూరు గ్రామంలో సంచరిస్తున్న ఎలుగుబండి

కుక్కలు వెంబడించటంతో కంపచెట్లలోకి పారిపోతుందని గ్రామస్తులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు ఆ ఎలుగుబంటిని పట్టుకొని, దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలం జీర్గేపల్లి గ్రామంలో రాత్రి పూట మూడు ఎలుగబంట్లు హల్‌చల్‌ చేశాయి. గ్రామంలోని స్వారక్క, గ్యారక్క, మూడుపక్క త్రిమూర్తి అమ్మవార్ల ఆలయంలో ఎలుగుబంట్ల సంచారం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయింది. ఈ గ్రామానికి ఆనుకొని ఆటవీ ప్రాంతం ఉండటంతో ఆలయంలోని అమ్మవార్లకు భక్తులు పెట్టే పండ్లు, ఫలహారం తినేందుకే ఎలుగుబంట్లు ఆలయంలోకి వస్తున్నట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.

Also read

Related posts

Share via