SGSTV NEWS
Andhra PradeshCrime

ప్రియుడి ప్రేమకు బానిసై భార్య దారుణం.. భర్తును అడ్డుతొలగించుకునేందుకు ఏం చేసిందో తెలిస్తే..


మదనపల్లి మండలం రెడ్డి గాని పల్లెలో 39 ఏళ్ల చంద్రశేఖర్ అనుమానాస్పద మృతి నిప్పు లాంటి నిజాన్ని బయట పెట్టింది. ఈ నెల 3న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భర్తను హత్య చేసింది భార్యేనని తేల్చారు. చంద్రశేఖర్ భార్య రమాదేవిని అరెస్ట్ చేసి వాస్తవాలు బయట పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి గాని పల్లికి చెందిన చంద్రశేఖర్ రమాదేవిలకు 7 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రమాదేవి వ్యవసాయ పనులకు వెళ్తుండగా, చంద్రశేఖర్ భావన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. సాఫీగానే సాగుతున్న వీరి సంసారంలోకి మూడో వ్యక్తి ఎంటర్‌ అవడం కొంప ముంచింది. రమాదేవికి పక్క గ్రామంలోని యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్..
అయితే గత కొంతకాలంగా భార్య సదురు యువకుడితో ప్రేమాయణం నడుపుతున్న విషయం భర్త చంద్రశేఖర్‌కు తెలిసిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. భర్త చంద్రశేఖర్‌కు మద్యం అలవాటు అయ్యింది. భార్య రమాదేవి ప్రవర్తనతో విసిగిపోయిన చంద్రశేఖర్ మద్యానికి బానిసగా మారాడు. రోజూ మద్యం ఇంటికి తెచ్చుకొని మత్తులో ఉంటున్న చంద్రశేఖర్ అలవాటు భార్య రమాదేవికి కలిసి వచ్చింది. ఇందులో భాగంగానే భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్న నేఫథ్యంలో రమాదేవికి ప్రియుడు మరింత దగ్గర అయ్యాడు. పక్క ఊరి యువకుడి ప్రేమకు బానిసైన రమాదేవి భర్త చంద్రశేఖర్ అడ్డును తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ఇందుకు ఆ యువకుడి సహాయం కూడా తీసుకుంది.ఈ మేరకు చంద్రశేఖర్ తెచ్చుకున్న మద్యంలోని విషం కలిపింది. యధావిధిగా రోజు మద్యం తాగే అలవాటున్న చంద్రశేఖర్ తృప్తిగానే లిక్కర్ సేవించి నిద్రపోయాడు. ఇక మత్తులో జారుకున్న భర్తను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసింది. దీంతో చంద్రశేఖర్ చనిపోయాడు.

సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం!
అయితే భర్త చనిపోయాడని తెలిసినా.. ఏమి ఎరగనట్టు రమాదేవి యధావిధి గానే రోజువారి పనికి వెళ్లిపోయింది. ఈ నెల 4న మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో ఇంటికి వచ్చి డెడ్ బాడీ చుట్టూ ఉన్న బ్లడ్ మార్క్స్ ను తుడిపేసి తనకే పాపం తెలియదన్నట్లు వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం పక్కా ప్లాన్ తో ఇంటికి వచ్చిన రమాదేవి.. భర్త చనిపోయాడని నానా హంగామా చేసింది. ఏడుస్తూ గగ్గోలు పెట్టి సాధారణ మరణంగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే చంద్రశేఖర్ మరణ వార్త తెలుసుకొని ఇంటికి చేరుకున్న చంద్రశేఖర్ తమ్ముడు మహేష్‌కు వదిన రమాదేవి వాలకంపై అనుమానం వచ్చింది. చంద్రశేఖర్ శరీరంపై గాయాలను గుర్తించి ఇది సహజ మరణం కాదని హత్యనేనని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


పోలీసుల విచారణలో వెలుగులోకి అసలు కథ!
బాధితుడి తమ్ముడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రమాదేవి వ్యవహారంలోనూ తేడాను గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగించారు. రమాదేవిని అదుపులోకి తీసుకొని విచారించిన మదనపల్లి రూరల్ సిఐ కళా వెంకటరమణ చంద్రశేఖర్ మర్డర్ మిస్టరీని చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త చంద్రశేఖర్‌ను హతమార్చేందుకు సహకరించిన ప్రియుడిని కూడా విచారించిన పోలీసులు రమాదేవిపై మాత్రమే హత్య కేసు నమోదు చేశారు. అమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు పోవడంతో వారి ఇద్దరు పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు.

Also read

Related posts

Share this