March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Kuppam: కూతురి ప్రేమ పెళ్లి.. అంతా చూస్తుండగానే కన్నతండ్రి ఏం చేశాడంటే..?

చిత్తూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తండ్రి కత్తితో దాడి చేశాడు. కౌసల్య, చంద్రశేఖర్ అనే జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో రాజీ పరిష్కారానికి ప్రయత్నించినా, తండ్రి కోపంతో దాడి చేశాడు. ఈ దాడిలో జంట తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ప్రస్తుతం సమాజంలో ప్రేమ వివాహాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నా.. కొన్ని చోట్ల మాత్రం ప్రేమ పెళ్లిళ్లు విషాదంగా మారుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రేమను అంగీకరించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవడమో లేక తమకు ఇష్టలేని పెళ్లి చేసుకున్నారని, వేరే కులం యువకుడిని వివాహం చేసుకున్నారని ఆగ్రహించే పెద్దలు వారిపై దాడికి తెగబడటం లాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలోనూ అలాంటి దారుణమే చోటు చేసుకుంది. కూతురు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని, ఓ తండ్రి కూతురితో పాటు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయిపై కూడా కత్తితో దాడి చేశాడు.


ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుడుపల్లి మండలం అగరం కొత్తూరు కు చెందిన కౌసల్య, చంద్రశేఖర్ వారం రోజుల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లి అయిపోయిన తర్వాత భవిష్యత్తులో గొడవలేం లేకుండా.. తమ వాళ్లతో మాట్లాడాల్సిందిగా ప్రేమ జంట గ్రామ పెద్దలను ఆశ్రయించారు. వారి ప్రేమపెళ్లి వ్యవహారం పై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ మేరకు కౌసల్య చంద్రశేఖర్ తో పాటు కౌసల్య తండ్రి శివప్పను కూడా పంచాయితీకి పిలిపించారు. కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో రాజీ చేసేందుకు ప్రయత్నించారు.

కానీ, కూతురి ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టంలేని శివప్ప.. పెద్దల సమక్షం లోనే కత్తితో కౌసల్య, చంద్రశేఖర్ లపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఊహించని ఘటనతో అంతా షాక్‌ అయ్యారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోనేలోపే.. శివప్ప ప్రేమ జంటపై కత్తి పోట్ల వర్షం కురిపించాడు. శివప్పను ఆపే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా కత్తి గాయాలకు గురయ్యారు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కౌసల్య, చంద్రశేఖర్ లను చికిత్స కోసం దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts

Share via