SGSTV NEWS
Andhra PradeshCrime

అనంతపురం.. దోశ ముక్క గొంతులో ఇరుక్కుని రెండేళ్ల బాలుడు మృతి..




అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దోశ తింటుండగా గొంతులో ఇరుక్కొని రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన బాలుడు తపోవనంలో నివాసం ఉండే అభిషేక్, అంజినమ్మ దంపతుల కుమారుడు కుశాల్‌గా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


దోశ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ రెండేళ్ల బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్ల ముందే తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం పట్టణంలోని తపోవనంలో అభిషేక్, అంజినమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు కుశార్ అనే రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే శుక్రవారం ఉదయం ఇద్దరు దంపతులు కొడుకుతో పాటు టిఫన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దోశ ముక్క ఒక్కసారిగా బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో బాలుడికి ఊపిరాకడ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.


కుమారుడు పడిపోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటీన బాలుడిని తీసుకొని స్థానిక హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. అయినా ఎలాంటి లాభం లేకపోయింది. కాసేపటికే ఆ బాలుడు ప్రాణాలుకోల్పోయాడు. కంటిరెప్పలా కాపాడుకుంటూ, అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారు తమ కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు

Also read

Related posts

Share this