టీ చాలా మంది ఫేవరెట్.. ఉదయం కప్పు టీ తాగితే కానీ చాలా మందికి రోజు గడవదు. మరి కొంత మంది టీ లేకుండా అస్సలూ ఉండలేరు.ఇలా అందిరీ ఫేవరెట్ అయిన టీ తాజాగా ఓ నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసింది. టీ తాగిన రెండ్రోజులకు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..యాడికి ప్రాంతానికి చెందిన రామస్వామి, చాముండేశ్వరి దంపతులకు హృతిక్ అనే నాలుగేళ్ల కుమారుడు, యశస్విని అనే ఏడాదిన్నర కూతురు ఉన్నారు.
అయితే రెండు రోజుల క్రితం తల్లి ఫ్లాస్క్‌లో టీ పోసి ఉంచింది. అయితే ఇంట్లోనే ఉన్న హృత్విక్‌కు దాహం వేయడంతో ప్లాస్క్ దగ్గరకు వెళ్లాడు అందులో ఉన్న వాటర్ అనుకొని వేడివేడి టీ తాగేశాడు. దీంతో హృత్విక్ గొంతు కాలిపోయింది.ఆ మంటను తట్టుకోలేక హృత్విక్ బిగ్గరగా ఏడ్చాడు. కాసేపటికే సృహకోల్పోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ బాలుడిని పరిక్షించిన వైద్యులు చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి బాలుడిని అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బాలుడు తుదిశ్వాస విడిచాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!