April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

చేతివేళ్లతో మహిళను హత్య చేసిన దుండగుడు

ఆన్‌లైన్ రమ్మీ… బెట్టింగ్ యాప్ లలో లక్షలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి… ఈజీ మనీ కోసం… ఈజీగా మర్డర్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆధారాలు దొరక్కుండా మనిషిని ఎలా చంపాలో యూట్యూబ్‌లో వీడియో చూసి నేర్చుకున్న ఓ దుండగుడు… ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి…

కర్ణాటక రాష్ట్రం పావగడలో తీగలాగితే సత్యసాయి జిల్లా మడకశిరలో డొంక కదిలింది.. కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా అరసికేర గ్రామానికి చెందిన రమాదేవికి… మడకశిర మండలం కదిరేపల్లి గ్రామానికి నరసింహమూర్తికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఆన్లైన్ రమ్మీ… బెట్టింగ్స్‌కు అలవాటు పడిన నరసింహమూర్తి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో పరిచయమైన రమాదేవి ఒంటిపై ఉన్న బంగారం కోసం… ఆమెను హత్య చేశాడు… సరిగ్గా నాలుగు నెలల క్రితం గత సంవత్సరం నవంబర్ 16వ తేదీన రమాదేవిని మడకశిర తీసుకొచ్చిన నరసింహమూర్తి… మడకశిర శివారు అటవీ ప్రాంతంలో రమాదేవిని గొంతు నిలిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకెళ్లాడు. హత్య చేసిన అనంతరం రమాదేవిని అటవీ ప్రాంతంలోనే తవ్వి పాతిపెట్టాడు.

అయితే మార్చి 16 వ తేదీ 2025 న, అంటే హత్య జరిగిన నాలుగు నెలల తర్వాత అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరులకు మనిషి అస్తిపంజరం కనిపించింది. దీంతో గొర్రెల కాపరులు మడకశిర పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మృతురాలు కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా అరసికేర గ్రామానికి చెందిన రమాదేవిగా పోలీసులు గుర్తించారు. మృతురాలు రమాదేవి హత్య జరిగి నాలుగు నెలలు అయిందని…. కేవలం అస్తిపంజరం మాత్రమే లభ్యమవడంతో… పోలీసులు ఈ కేసును చాలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. రమాదేవితో చివరిసారిగా ఎవరు మాట్లాడారో,. కాల్ డేటా సేకరించిన పోలీసులు…. తరచూ నరసింహమూర్తి, రమాదేవి మధ్య ఫోన్ కాల్ సంభాషణలు జరిగినట్లు గుర్తించారు. దీంతో హత్య చేసి పరారీలో ఉన్న నరసింహమూర్తి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

అయితే విచారణలో నరసింహమూర్తి చెప్పిన విషయాలు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఆన్లైన్ రమ్మీ… బెట్టింగ్ యాప్‌లలో లక్షలు పోగొట్టుకున్న నరసింహమూర్తి డబ్బులు కోసం… రమాదేవిని హత్య చేసినట్లు విచారణలో తేలింది. రమాదేవి ఒంటిపై ఉన్న బంగారం కోసం…. పెద్ద స్కెచ్ వేశాడు… హత్యకు కొద్ది రోజులు ముందు… ఆధారాలు దొరక్కుండా…. ఎలాంటి మారణాయుధాలు ఉపయోగించకుండా మనిషిని ఎలా చంపాలో? యూట్యూబ్‌లో వీడియోలు చూశాడు. కేవలం చేతి వేళ్లతో మర్మ కళ ద్వారా మనిషిని హత్య చేయటం ఎలాగో నేర్చుకున్నాడు. మడకశిర అటవీ ప్రాంతానికి రమాదేవిని తీసుకువచ్చిన నరసింహమూర్తి చేతివేళ్లతో గొంతు నులిమి… రక్తం కక్కుకుని చనిపోయేటట్లు హత్య చేశాడు. అనంతరం రమాదేవి డెడ్ బాడీని నరసింహమూర్తి గుంత తవ్వి పాతిపెట్టాడు. అలా చెడు వ్యసనాలకు అలవాటు పడిన నరసింహమూర్తి… బంగారం కోసం రమాదేవిని ఎలా హత్య చేయాలో??? యూట్యూబ్లో వీడియోలు చూసి మరీ దారుణానికి ఒడికట్టాడు. కాల్ డేటా ఆధారంగా ఎట్టకేలకు నిందితుడు నరసింహమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు

Also read

Related posts

Share via