పిల్లనిచ్చిన అత్తమామతోపాటు 8 నెలల గర్భిణీ అయిన భార్య వేదింపులు తట్టుకోలేక సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం కందాడులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపతి, అక్టోబర్ 18: కుటుంబ కలహాలతో ఉరివేసుకుని సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం కందాడులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం కందాడులో నిరంజన్ (28) అనే వ్యక్తి సచివాలయం ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు భార్య విద్యప్రియతో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యతోపాటు మామ సుబ్రమణ్యం,అత్త చంద్రిక, హేమలతలు వేధింపులు గురిచేయడంతో తీవ మానసిక ఒత్తిడికి గురైన నిరంజన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె తరపు పుట్టింటి వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వాట్సాప్ ద్వారా పోలీసులకు, కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపిన నిరంజన్.. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో కందాడు గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద నున్న రేకుల షెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన చావుకు కారణమైన అత్తింటి వారిని కఠినంగా శిక్షించాలని తన సందేశంలో నిరంజన్ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ను తననుంచి దూరం చేసి ఆమెకు వీరే పెళ్లి చేయాలని అత్తింటి వారు చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడవద్దని, వేరే కాపురం పెట్టాలని లేకుంటే అదనపు కట్నం కింద కేసులు పెడతామని భార్య ఇబ్బంది పెట్టినట్లు వాట్సాప్ మెసేజ్ లో నిరంజన్ పేర్కొన్నాడు. తను చేయని అప్పులకు బలవంతంగా సంతకాలు పెట్టించుకొని ఆ డబ్బులతో జల్సాలు చేశారని ఆవేదన చెందాడు. ఇక నిరంజన్ సూసైడ్ విషయం తెలుసుకున్న ఏర్పేడు పోలీసులు, నీరంజన్ కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిరంజన్ భార్య విద్యప్రియ, మామ సుబ్రమణ్యం అత్త చంద్రిక, హేమలతపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిరంజన్ భార్య విద్యప్రియ ప్రస్తుతం 8 నెలల గర్భంతో ఉండటం విశేషం.
Also read
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..