కోత్తగా పెళ్లయి కోటి ఆశలతో మెట్టినింట అడుగుపెట్టింది ఆ ఇల్లాలు. తన భవిష్యత్ గురించి ఎన్నెన్నో కలలు కంది. భర్త, పిల్లలు, అత్త మామలు గురించి ఆమెకు ఎన్నో మంచి ప్లానింగ్స్ ఉన్నాయి. కానీ భర్త టార్చర్ ముందు ఆమె ఆశలు అన్నీ అడియాశలయ్యాయి. మదపిచ్చితో అతడు చేసిన పని.. ఆమె ఉసురు తీసింది.
విశాఖలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త టార్చర్ తాళలేక నవవధువు వసంత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గోపాలపట్నం నందమూరి కాలనీలో చోటుచేసుకుంది. అశ్లీల వీడియోలు చూపించి తీవ్రంగా టార్చర్ చేశాడు భర్త నాగేంద్రబాబు. దీంతో తట్టుకోలేక ఊరివేసుకుంది వసంత. నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భర్తే హత్య చేశాడని వసంత కుటుంబం ఆరోపిస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని కుటుంబ సభ్యుల దగ్గర వాపోయింది. కొన్ని రోజులుగా ఈ సమస్యను తమ ముందు చెబుతోందన్నారు కుటుంబ సభ్యులు. గత రాత్రి కూడా ఫోన్ చేసిందని.. అయితే రేపు వచ్చి మాట్లాడాతామని చెప్పామన్నారు. ఇంతలోనే వారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఆమె చనిపోయిందని చెప్పారంటున్నారు.. అయితే ఇది ఆత్మహత్య కాదని.. హత్య అంటూ ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు
Also read
- Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్‌ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- Telangana: మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. భర్త ఏం చేశాడో చూస్తే దిమ్మతిరుగుద్ది.!
- Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
- Telangana: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని.. ఒక్కసారిగా శబ్దం.. ఏమైందంటే..?